
ప్రతీ మనిషి జీవితంలో ఏదో రకంగా శ్రమ పడుతుంటాడు. అది మానసికంగా కావచ్చు.. లేదా శారీరకంగా కావచ్చు.. అయితే పని ఒత్తిడి నుంచి రిలీఫ్ కావడానికి అనేక ఆనందాలను కోరుకుంటారు కొందరు. చాలా మందికి శృంగారంలో పాల్గొంటే ఆరోజు పడిన శ్రమంతా మాయమైవుతుందని భావిస్తారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత మందికీ రోజూ అంటూ సాధ్యం కాకపోవచ్చు. పక్కా ప్లానింగ్ తో ఓ షెడ్యూల్ ప్రకారం ఈ కార్యంలో పాల్గొంటే మీతో పాటు మీ భాగస్వామిని కూడా ఆనందపరిచినవారవుతారు. అయితే ఎలాంటి ప్లాన్ వేయాలి..? ఏ సమయంలో ఆ కార్యంలో పాల్గొనాలి..?
నేటి బీజీ షెడ్యూల్లో ప్రతి ఒక్కరు తీరిక లేని జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మీ భాగస్వామితో ఓ గంట సమయం కేటాయించండి. ప్రతీ రోజూ అదే సమయాన్ని షెడ్యూల్ గా పెట్టుకుంటే అప్పటి వరకు మీ భాగస్వామి మిమ్మల్ని డిస్ట్రబ్ కూడా చేయ్యదు. ఇక ఆ సమయం వచ్చేసరికి ఇద్దరిలోనూ కోరికలు పుడుతాయి. ఫలితంగా శృంగారంలో విపరీతమైన ఆనందాన్ని పొందవచ్చు. రోజూ వీలు కానివాళ్లు వారంలో ఒకసారైనా టైం పెట్టుకోండి. మరీ ఎక్కువ రోజులైతే గ్యాప్ ఏర్పడి వేరే పరిస్థితులకు దారి తీసే ప్రమాదం ఉంది.
భాగస్వామి ఇష్టాయిష్టాలను గౌరవించండి. మీ లవర్ కావచ్చు.. భార్య కావచ్చు.. ఆమె అడిగిన చిన్న చిన్న అవసరాలను వెంటనే తీర్చండి. ఇక్కడే మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. చాలా మంది ఆడవాళ్లు పెళ్లయిన మొదట్లో బడ్జెట్ ప్రకారమే కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారు. ఇక మంచి లవర్ అయితే ఇలాగే పాటిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ బలపడి ఆ కార్యంలో ఇష్టపూర్వకంగా పాల్గొంటారు.
ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. చిన్న తలనొప్పే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఆ కార్యం సమయానికి వేరే దానిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో భాగస్వామి అర్థం చేసుకున్నా లోలోపల మాత్రం కోరిక తీరలేదనే భావనతో ఉంటారు. అందువల్ల నిత్యం ఆరోగ్యంగా ఉంటూ భాగస్వామిని సంతృప్తి పరిచే విధంగా రెడీగా ఉండండి.
వారంలో లేదా నెలకు ఒకసారైన మీరుంటున్న సిటీని వదిలి ఇతర ప్రదేశాలకు వెళ్లండి. అలా వెళ్లడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతేకాకుండా మనసు ఉల్లాసమై కోరికల్లో ఉత్సాహం వస్తుంది. మంచి ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి అక్కడ రోజంతా గడపండి. ఆరోజు ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకోని రాత్రంతా పడుకుంటే అప్పటి వరకున్న బాధలన్నీ మరిచిపోతారు. ఇలా షెడ్యూల్ ప్రకారం కార్యాన్ని నిర్వహించుకుంటే జీవితాంతం సుఖమయంగా ఉంటుంది.