
పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా నేడు కాంగ్రెస్ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ నుంచి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. గవర్నర్ కు వినతిపత్రం అందజేస్తామన్నారు. ధరలపై పార్లమెంట్ ను కూడా స్తంభింపజేస్తామన్నారు. నిర్భంధించాలని చూస్తే పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.