White discharge : వైట్ డిశ్చార్జ్‌తో ఇబ్బందిపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి

సాధారణంగా ఈ వైట్ డిశ్చార్జ్ అంత తొందరగా తగ్గదు. చాలామందికి పీరియడ్స్‌కి ముందు లేదా తర్వాత వస్తుంది. ఇదేమీ పెద్ద ప్రమాదం కాదు. కానీ రోజూ ఎక్కువగా అయితే మీరు సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. వీటికోసం మీరు బియ్యం కడిగిన నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Written By: Swathi, Updated On : August 23, 2024 6:03 pm

White discharge in Womens

Follow us on

White discharge : ప్రతి మహిళ ఏదో ఒక సమయంలో వైట్ డిశ్చార్జ్ సమస్యతో ఇబ్బంది పడి ఉంటుంది. మహిళల్లో వైట్ డిశ్చార్జ్ అనేది కామన్. అయితే ఇది కాస్త ఎక్కువైతే చాలా ఇబ్బందులు ఉంటాయి. అధికంగా వైట్ డిశ్చార్జ్ కావడం వల్ల తొందరగా బరువు తగ్గడం, అలసట, నీరసం, కాళ్లు నొప్పులు వంటి సమస్యలు వస్తాయి. అయితే వైట్ డిశ్చార్జ్ అనేది తక్కువగా అయితే ఇబ్బందేమీ లేదు. కానీ అధికంగా అయితే జాగ్రత్త పడాల్సిందే. సాధారణంగా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత, ప్రెగ్నెన్సీ, ఒత్తిడి, ఆందోళన వంటి వాటివల్ల కూడా ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. దీనిని తగ్గించుకోవడానికి ఎన్నో మందులు వాడిన సమస్య అంత తొందరగా తగ్గదు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని సహజ పద్ధతులు ఉన్నాయి. వీటిని పాటిస్తే మీరు వైట్ డిశ్చార్జ్ సమస్య నుంచి బయటపడవచ్చు.

సాధారణంగా ఈ వైట్ డిశ్చార్జ్ అంత తొందరగా తగ్గదు. చాలామందికి పీరియడ్స్‌కి ముందు లేదా తర్వాత వస్తుంది. ఇదేమీ పెద్ద ప్రమాదం కాదు. కానీ రోజూ ఎక్కువగా అయితే మీరు సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. వీటికోసం మీరు బియ్యం కడిగిన నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది. వండేటప్పుడు బియ్యాన్ని బాగా కడుగుతాం. అలా మొదటిసారి కడిగిన బియ్యం నీరు పడేయాలి. రెండోసారి కడిగిన నీటిని ఒక గ్లాసులోకి వేసుకోవాలి. ఈ నీటిని గంట తర్వాత తాగితే ఫలితం ఉంటుంది. ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల వైట్ డిశ్చార్జ్ సమస్యను తగ్గిస్తుంది. అలాగే జామ ఆకులతో కూడా ఈ సమస్యను తగ్గించవచ్చు. సరిపడా జామఆకులను తీసుకుని మంచిగా కడగాలి. ఆ తర్వాత గ్లాసు నీటిని మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత జామ ఆకులు వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత కాస్త చల్లార్చుకుని తాగాలి. అలాగే మెంతుల పొడి లేదా మెంతుల వాటర్‌ను రోజూ ఉదయం తాగితే వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది.

వైట్ డిశ్చార్జ్ తగ్గాలంటే ఫుడ్ విషయంలో చిట్కాలు పాటిస్తే సరిపోదు. పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలి. యోనిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. సువాసన, రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్‌ అస్సలు వాడకూడదు. ఎప్పుడు యోని పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి. బయట టాయిలెట్స్ ఉపయోగించే ముందు జాగ్రత్త వహించాలి. లేకపోతే వీటివల్ల యోని ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే కలయిక విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. కేవలం వైట్ డిశ్చార్జ్ అవుతుంటే పర్లేదు. ఎందుకంటే అమ్మాయిలకు ఇది కామన్. కానీ ఎక్కువగా అయి, దురద, దుర్వాసన వంటివి ఉంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. లేకపోతే ఇది కాస్త ఎక్కువయ్యి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి పరిశుభ్రంగా ఉంటూ యోని విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి.