https://oktelugu.com/

Tea powder : టీ చిక్కగా, రుచిగా రావడానికి క్యాన్సర్ కారక కెమికల్స్.. అసలేం జరిగిందంటే?

తాజాగా టీ పౌడర్ విషయంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. టీ రుచిగా ఉండడానికి ఓ వ్యక్తి నకిలీ టీ పౌడర్ ను తయారు చేసి విక్రయిస్తున్నారు. టీ చిక్కదనం, రుచి రావడానికి కెమికల్ ను కలుపుతున్నట్లు ఫుడ్ సేప్టీ అధికారులు గుర్తించారు. ఆ వివరాల్లోకి వెళితే..

Written By:
  • Srinivas
  • , Updated On : December 18, 2024 / 06:03 AM IST

    Fake tea powder is being sold

    Follow us on

    Tea powder : ఉదయం లేవగానే ఓ కప్పు టీ తాగనిదే దినచర్య ప్రారంభం కాదు. కొందరు బెడ్ కాఫీ పేరుతో బెడ్ పైనే తాగేస్తుంటారు. టీ తాగడం వల్ల మనసు ఉల్లాసంగా మారిపోతుంది. శరీరంలో కొత్త ఉత్తేజాన్ని అందిస్తుంది. టీ వల్ల మెదడులో చలనంఏర్పడి నిద్రమబ్బును పోగొడుతుంది. అయితే టీలో వాడే పౌడర్ ఎలాంటిదో తెలుసుకొని ఉండాలి. మార్కెట్లో రకరకాల టీ పౌడర్లు ఉన్నాయి. కొన్ని బ్రాండెడ్ వి ఉండగా…కొన్ని షాపుల్లో స్టిక్కర్ లేకుండా టీ పౌడర్ విక్రయిస్తున్నారు. అయితే తాజాగా టీ పౌడర్ విషయంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. టీ రుచిగా ఉండడానికి ఓ వ్యక్తి నకిలీ టీ పౌడర్ ను తయారు చేసి విక్రయిస్తున్నారు. టీ చిక్కదనం, రుచి రావడానికి కెమికల్ ను కలుపుతున్నట్లు ఫుడ్ సేప్టీ అధికారులు గుర్తించారు. ఆ వివరాల్లోకి వెళితే..

    ప్రతిరోజూ సేవించే పానీయాల్లో టీ ఒకటి. పాలతో పాటు టీ పౌడర్, పంచదార వేయడం వల్ల టీ తయారవుతుంది. అయితే చాలా మంద పాలు కల్తీ ఉన్నాయని అనుకుంటారు. కానీ టీ పౌడర్ విషయంలోనూ కేర్ తీసుకోవాలి అని తాజాగా వెలుగు చూసిన సంఘటనను బట్టి తెలుస్తోంది. హైదరాబాద్ లోని కాచిగూడలో మహేష్ గిరి అనే వ్యక్తి టీ పౌడర్ విక్రయిస్తుంటారు. వివిధ రకాల టీ పౌడర్లను తీసుకొచ్చి.. వాటిని మిక్స్ చేసి విక్రయిస్తుంటారు. ఈ టీ పౌడర్ ను నేరుగా వినియోగదారులకు, టీ స్టాళ్లు, ఇతర రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నాడు. అయితే కొన్ని చోట్ల మహేష్ గిరి టీ పౌడర్ తో టీ రుచిగా తయారైంది. దీంతో చాలా మంది ఇతని వద్దే టీ పౌడర్ ను కొనుగోలు చేశారు.

    ఈ క్రమంలో మహేష్ గిరి తన సేల్స్ ను పెంచుకునేందుకు టీ పౌడర్ లో కొన్ని కెమెకల్స్ ను కలిపాడు. వీటితో టీ చిక్కదనం అవుతుంది. అంతేకాకుండా తక్కువ చెక్కర వేసినా టీ రుచిగా మారుతుంది. కొందరు ఈ విషయంపై పరిశోధించారు. మహేష్ గిరి టీ ఇంత రుచిగారావడానికి కారణమేంటని పరిశీలించగా.. అతడు తన టీ పౌడర్ లో క్యాన్సర్ కారకాల కొన్ని కెమికల్స్ కలిపినట్లు తెలిసింది. దీంతో ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే మహేష్ గిరికి చెందిన ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో మహేష్ ఇంట్లో క్వింటాళ్ల కొద్దీ టీ పౌడర్ లభ్యమైంది. వీటిలో చాలా వరకు కెమికల్స్ కలిపినట్లు గుర్తించారు. అయితే చాలా రోజుల నుంచి మహేష్ ఈ దందా నడిపిస్తున్నట్లు సమాచారం. దీంతో పోలసులు టీ పౌడర్ తో పాటు ఇంటిని సీజ్ చేసి అతడిని అరెస్ట్ చేశారు.

    కాస్త తలనొప్పి వచ్చినా.. మనసు ఆందోళనగాఉన్నా.. టీ తాగుతూ ఉంటాం. కానీ టీ పౌడర్ లోనూ కెమికల్స్ కలిశాని తెలియడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కొందరుపదుల కొద్దీ టీ లుతాగుతూ ఉంటారు. ఇలా టీ పౌడర్ లో క్యాన్సర్ వచ్చే కెమికల్స్ ఉన్నాయని తెలిస్తే ఎలా? అని కొందరు చర్చించుకుంటున్నారు.