Agriculture : భారతదేశానికి రైతు వెన్నెముక అంటారు. రైతులు లేకుండా ఆహారం దొరకడం కష్టంగా మారుతుంది. ప్రతిరోజూ తీసుకునే ఆహారం రైతులు పండించినవే. ఎన్నో కష్టాలు పడి రైతులు పంటలను సాగు చేస్తూ ఉంటారు. కానీ వారి కష్టానికి తగిన ఫలితం ఉండడం లేదు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి చేసిన పంటలు సరైన సమయంలో విక్రయాలు జరగలేక.. వాటికి పెట్టుబడులు కూడా రావడం లేదు. దీంతో అవి రోడ్డు పాలే అవుతున్నారు. ఫలితంగా రైతులకు సరైన ఆదాయం రాకుండా ఆందోళన చెందుతున్నారు. అయితే చాలా మంది రైతులు మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయాన్ని కాస్త డిఫరెంట్ గా చేయడం వల్ల లక్షల్లో సంపాదించవచ్చు. అదెలాగంటే?
వ్యసాయం ఒకప్పుడు దండగ అన్నారు. కానీ ఇప్పుడు చాలా మంది విదేశాల్లో ఉన్న వారు సైతం పెద్ద పెద్ద ఉద్యోగాలను వదిలి వ్యవసాయం చేయడానికి సొంత స్థలాలకు వస్తున్నారు. అయితే కొందరు ఒకే రకమైన వ్యవసాయం కాకుండా ఇందులో వినూత్న పద్ధతులు ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఒకే రకమైన వ్యవసాయం కాకుండా అన్ని రకాలుగా చేస్తున్నారు. ఉదాహరణకు కొన్నిఎకరాల భూమిలో కేవలం వరి లేదా పత్తి పంటలు మాత్రమే కాకుండా కూరగాయలు, పండ్లతోటతో పాటు కోళ్లు, చేపల పెంపకం నిర్వహించవచ్చు.
ఎక్కువ మంది రైతులు 5 ఎకరాల భూమి ఉందంటే ఇందులో వరి లేదా పత్తి మొక్కజొన్న వంటి ఒకే రకమైన పంటలు వేస్తుంటారు. వీటి క్రాప్ చేతికొచ్చాక ఒకే రకమైన ఆదాయాన్ని పొందగలుగుతారు. అదే ఈ భూమిలో 2 ఎకరాల పంటలు, మరో ఎకరంలో కూరగాయలు, ఇంకో ఎకరంలో చేపల పెంపకం , చివరి ఎకరంలో కోళ్ల పెంపకం చేపట్ట వచ్చు. ఇలా చేయడం వల్ల ఏదో ఒక క్రాప్ ప్రతి రోజూ చేతికి వస్తుంది. వీటికి నేరుగా లేదా రోడ్ సైడ్ విక్రయించడం వల్ల రైతుల నుంచి వినియోగదారులకు వెళ్తాయి. అంతేకాకుండా రైతుల నుంచి నేరుగా వినియోగదారులకు వెళ్లడం వల్ల ఎలాంటి ధరలు కూడా ఎక్కువగా ఉండవు.
కొంత మంది రైతులు ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. ఒకే రకమైనవ్యవసాయం కాకుండా రకరకాల పంటలు వేస్తున్నారు. రైతులు ఎంతో కష్టపడి పంటలు పండించిన తరువాత దళారులు వారి వద్ద తక్కువకు కొనుగోలు చేసి.. ఆతరువాత వాటిని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. కానీ ఇలాంటి వ్యవసాయం చేయడం వల్ల ప్రతి రోజూ ఏదో ఒక పంటను విక్రయించుకోవచ్చు. అంతేకాకుండా అటు రైతులకు, ఇటు కొనుగోలుదారులకు ఆదాయం మిగిలినట్లు అవుతుంది.
అయితే ఇలాంటి వ్యవసాయం చేయడం వల్ల కొంత మంది సాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యక్తులు నమ్మకంగా ఉండగలిగినప్పుడే దీనిని ప్రారంభించుకోవాలి. అంతేకాకుండా వీరికి కుటుంబ సభ్యుల సాయం ఉంటే మరింత లాభ పడుతారు. తక్కువ భూమి ఉన్నవారు సైతం తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి వివిధ రకాల పంటలు వేయడం వల్ల అధిక లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.