Food For Childrens: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు పూర్తిగా వారి ఆహార విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నారు. కేవలం మన నోటికి రుచి కలిగిన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటూ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను పక్కన పెడుతున్నారు.ఈ క్రమంలోనే మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలను కోల్పోవడమే కాకుండా మన శరీరానికి అధిక వ్యాధులు కలిగించే అధిక కేలరీలు కొవ్వు కలిగిన ఆహార పదార్ధాలను తినడానికి మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలోనే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇలాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల అతి చిన్నవయసులోనే ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లల ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా పిల్లలకు ఇలాంటి ఆహార పదార్థాలను అసలు తినిపించకూడదు.
సాధారణంగా పిల్లలు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాల కన్నా క్యాలరీలు అధికంగా ఉన్నటువంటి ఆహార పదార్ధాలను తినడానికి ఇష్టపడతారు. అటువంటి వాటిలో చాక్లెట్స్ ఒకటి.సాధారణంగా పాలతో తయారుచేసిన చాక్లెట్స్ అధికంగా తినడం వల్ల వాటిలో ఎక్కువ చక్కెర శాతం కలిగి ఉంటుంది. అందుకే ఇలాంటి చాక్లెట్ చాక్లెట్ ఎంతో ఉత్తమం.అలాగే పిల్లలు చిప్స్ ఎక్కువగా తినడానికి మక్కువ చూపుతారు కనుక ఇలాంటివి తినిపించడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్యప్రయోజనాలు లేకపోవడమే కాకుండా అధిక క్యాలరీలు, ఉప్పు ఉండటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి కనుక చిప్స్ ని పూర్తిగా దూరం పెట్టండి.
అలాగే ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలను తినడానికి పిల్లలు ఇష్టం చూపుతారు. ఈ క్రమంలోనే అతి చిన్న వయసులోనే శరీర బరువు పెరగడమే కాకుండా ఊబకాయానికి దారితీస్తుంది. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక చాలామంది మార్కెట్లో దొరికే వివిధ రకాల కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. వీటిలో అధిక చక్కెర శాతం ఉండటం వల్ల పలు సమస్యలకు కారణం అవుతుంది కనుక ఇంట్లోనే తాజాగా తయారుచేసుకున్న పండ్ల రసాలు తాగడం ఎంతో ఉత్తమం. ఇక పిల్లలు ఎక్కువగా ఇష్టపడే వాటిలో కెచప్ ఒకటి.ఎక్కువగా కెచప్ తీసుకోవటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వెంటాడతాయి కనుక ఈ విధమైనటువంటి ఆహారపదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచడం ఎంతో ఉత్తమం.