https://oktelugu.com/

KCR Target: కేసీఆర్ టార్గెట్ బీజేపీనా.. కాంగ్రెస్సా?

KCR target: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లు పూర్తికాకుండా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి మొదటి దఫా కంటే ఎక్కువ సీట్లను సాధించి సత్తాచాటారు. అయితే టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొన్నివర్గాలు టీఆర్ఎస్ కు వెన్నుదండుగా నిలుస్తుండగా మరికొన్ని వర్గాల్లో మాత్రం పూర్తి వ్యతిరేకత కనబడుతోంది. ఈ వర్గాలన్నీ ప్రతిపక్ష పార్టీలకు ఓటుబ్యాంకుగా మారుతుండటంతో టీఆర్ఎస్ రాష్ట్రంలో గడ్డు పరిస్థితులను […]

Written By:
  • NARESH
  • , Updated On : December 12, 2021 / 01:18 PM IST
    Follow us on

    KCR target: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లు పూర్తికాకుండా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి మొదటి దఫా కంటే ఎక్కువ సీట్లను సాధించి సత్తాచాటారు. అయితే టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొన్నివర్గాలు టీఆర్ఎస్ కు వెన్నుదండుగా నిలుస్తుండగా మరికొన్ని వర్గాల్లో మాత్రం పూర్తి వ్యతిరేకత కనబడుతోంది.

    ఈ వర్గాలన్నీ ప్రతిపక్ష పార్టీలకు ఓటుబ్యాంకుగా మారుతుండటంతో టీఆర్ఎస్ రాష్ట్రంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా టీఆర్ఎస్ ఉపఎన్నికల్లో వరుసగా ఓడిపోవడం ఆపార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తోంది. టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎదుగుతున్నాయి. బీజేపీ అయితే ఏకంగా టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటూ రాజకీయాలను హీటెక్కిస్తోంది.

    తెలంగాణలో బలహీనంగా ఉన్న బీజేపీ క్రమంగా టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తుండటంతో సీఎం కేసీఆర్ అలర్ట్ అవుతున్నారు. ఇన్నిరోజులు కేంద్రంతో సయోధ్యగా మెలిగిన కేసీఆర్ ప్రధాని మోదీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలోనే వరుసగా టీఆర్ఎస్ కు గట్టి షాకిలిస్తున్న బీజేపీ ఏకంగా అధికారంపైనే కన్నేసింది. దీంతో ఇరుపార్టీల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది.

    రాబోయే ఎన్నికలు కేంద్రంలోని బీజేపీకి, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీలకు కీలకంగా మారనున్నాయి. దీంతో ఈరెండు పార్టీలు ఏయే పార్టీలతో ముందుకెళ్లాలనే వ్యూహాలను రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. 2004లో టీఆర్ఎస్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. 2009లో టీడీపీతో పొత్తుపెట్టుంది. బీజేపీతో మాత్రం ఇప్పటిదాకా ఆపార్టీ పొత్తు పెట్టుకోలేదు.

    రాష్ట్రంలో నాడు ఆపార్టీ బలంగా లేకపోవడమే కారణం. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. బీజేపీ రాష్ట్రంలో బలమైనశక్తిగా అవతరించింది. రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేసీఆర్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. ఈక్రమంలోనే కేంద్రంలోని బీజేపీకి షాకిచ్చేలా తాము ఎన్డీఏ వైపు ఉండబోమనే సంకేతాలను పంపిస్తున్నారు.

    తమకున్న ఉన్న పరిచయాలతో టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో కాంగ్రెస్ ను నమ్మించి మోసం చేసిన చరిత్ర కేసీఆర్ ఉంది. దీంతో ఆపార్టీని నమ్మేందుకు కాంగ్రెస్ సహా, ఇతర పార్టీలేవి సిద్ధంగా లేవని ఢిల్లీలో టాక్ విన్పిస్తోంది. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీలోని కాంగ్రెస్ వైపు ఉంటారా? లేదంటే బీజేపీ వైపు వెళుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.