Sleeping : పురుషుల కంటే స్త్రీలు ఎక్కువసేపు నిద్రపోతారని అంటారు. ఇది మహిళల ఆరోగ్యానికి సరైనదని చాలా మంది నమ్ముతున్నారు కూడా. అయితే అది రూమర్ అని కొందరి మాట. కాదని కొందరి వాదన. అయితే ఇప్పుడు మనకున్న ప్రశ్న ఏంటంటే? పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ నిద్ర అవసరమా? దీనిలో ఎంత వరకు కరెక్ట్ ఉందనే విషయం ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. మహిళలకు ఎక్కువ నిద్ర అవసరమా? అంటే అవును అంటున్నారు నిపుణులు. రోజూ 7 నుంచి 8 గంటలు మంచి నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరం. మంచి నిద్ర శారీరక , మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నిద్ర లేకపోతే అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది.
పురుషుల కంటే స్త్రీలు ఎక్కువసేపు నిద్రపోతారని కొందరు అంటారు. ఇది ఆరోగ్యానికి మంచిదే అయితే పురుషుల కంటే మహిళలకు నిజంగా ఎక్కువ నిద్ర అవసరమా? అనుకుంటారు కొందరు. స్లీప్ ఫౌండేషన్ ప్రకారం, పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరం అంటున్నారు నిపుణులు. స్త్రీలు ప్రతిరోజూ కనీసం 7 నుండి 9 గంటలు నిద్రించాలట. స్త్రీలందరూ హార్మోన్ల మార్పులు, రుతుక్రమం, గర్భం , మెనోపాజ్ వంటి అనేక పరిస్థితులను ఎదుర్కొంటారు. ఈ కారణంగా, వారు తక్కువ సమయం నిద్రపోతారు. నిద్రలేమి అనేది మహిళలకు సాధారణ సమస్య. కాబట్టి మహిళలకు నిద్ర అవసరం.
పురుషుల కంటే మహిళలకు ఎక్కువ ఒత్తిడి ఆందోళన ఉంటుంది. ఇది నిద్ర సమస్యలను కలిగిస్తుంది. ఈ అంశాల ఆధారంగా పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరమని చెప్పవచ్చు. చాలా అధ్యయనాలు కూడా మహిళలు ఎక్కువసేపు నిద్రపోతారని సూచిస్తున్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం, మహిళలు పని, సామాజిక బాధ్యతలు , కుటుంబ సంరక్షణ కారణంగా ఎక్కువ నిద్రపోతారు. కాబట్టి వారికి ఎక్కువ నిద్ర అవసరం. ఇక మగవారి కంటే మహిళలు ఇంట్లో ఇతరులను , ఇంటి పనులు ఎక్కువగా చూసుకోవడం వల్ల తెల్లవారుజామునే నిద్ర లేస్తారు.
దీంతో మహిళల్లో నిద్రలేమి, డిప్రెషన్, యాంగ్జయిటీ, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోజూ తగినంత నిద్ర లేకపోతే బరువు పెరగడం, గుండె జబ్బులు , బలహీనమైన రోగనిరోధక శక్తి వంటి ఎన్నో సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. ఈ సమస్యలన్నింటిని నివారించాలంటే మహిళలకు సరైన నిద్ర అవసరమే. నిద్ర మాత్రమే కాదు, మంచి నాణ్యమైన నిద్ర ముఖ్యం. బాగా నిద్రపోవాలంటే రాత్రి పడుకునే కొన్ని గంటల ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వాడడం, టీవీ చూడటం మానేయాలి. ఇదంతా సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరిన్ని వివరాల కోసం నిపుణుల సలహా తీసుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..