https://oktelugu.com/

Heart problems : మహిళలు తస్మాత్ జాగ్రత్త.. గుండె సమస్యలు మీకే ఎక్కువట

గుండె సంబంధిత పరీక్షల వల్ల ప్రమాదాన్ని సకాలంలో గుర్తించి చికిత్స పొందడం సులభం అవుతుంది. అదే సమయంలో గుండె ఆరోగ్యం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పురుషులతో పోలిస్తే స్త్రీలు గుండె సంబంధిత పరీక్షలు త్వరగా చేయించుకోవాలి. దీనివల్ల సమస్యను సకాలంలో గుర్తించవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : October 14, 2024 / 01:27 AM IST

    Heart problems

    Follow us on

    Heart problems : ప్రస్తుతం గుండె సంబంధిత సమస్యలు చాలా కామన్ గా వస్తున్నాయి. అందుకే ప్రజలు చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు, గుండె ఆగిపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలి పోతున్నారు. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత మహిళల్లో గుండె సంబంధిత వ్యాధుల వస్తుంటాయి. అందుకే చెకప్స్ చాలా అవసరం. ముఖ్యంగా గుండె ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం కూడా చాలా అవసరం అంటున్నారు నిపుణులు. మరి మీరు మీ గుండె గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఈ కేసుల్లో మీరు ఒకరు ఉండకూడదు.

    గుండె సంబంధిత పరీక్షల వల్ల ప్రమాదాన్ని సకాలంలో గుర్తించి చికిత్స పొందడం సులభం అవుతుంది. అదే సమయంలో గుండె ఆరోగ్యం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పురుషులతో పోలిస్తే స్త్రీలు గుండె సంబంధిత పరీక్షలు త్వరగా చేయించుకోవాలి. దీనివల్ల సమస్యను సకాలంలో గుర్తించవచ్చు. ఎందుకంటే గుండె సంబంధిత వ్యాధులు మహిళల్లో మరింత ఎక్కువ అంటున్నారు నిపుణులు. అందుకే గుండె సంబంధిత వ్యాధుల కారణంగా మహిళల్లో మరణాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. అందుకే వీరు జాగ్రత్తగా ఉండటం మరింత అవసరం.

    ఏ వయసులో పరీక్షలు చేయించుకోవాలి?
    మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్న మహిళలు తమ గుండెను క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకోవాలి. దీని వల్ల సమస్యను ముందే గుర్తించవచ్చు అంటున్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వరుణ్ బన్సాల్. అంతేకాదు గుండె సంబంధిత వ్యాధుల కుటుంబ చరిత్ర ఉన్న మహిళలకు ఈ సమస్య మరింత త్వరగా వస్తుంది. వంశపారంపర్యంగా కూడా ఈ గుండె సమస్య బాధ పెడుతుంది. వీరికి ఇతరుల కంటే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

    ఊబకాయం లేదా మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నా కూడా గుండె చెకప్‌ను క్రమం తప్పకుండా చేయించుకోవాలి. మహిళలు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం రెగ్యులర్ చెకప్‌లను తప్పనిసరిగా చేయించుకోవాలి. ప్రస్తుత జీవనశైలి కారణంగా మహిళలు అతి చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, ధూమపానం, ఒత్తిడి, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, తక్కువ నిద్ర వంటి కారణాలు గుండె సమస్యలకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. ప్రతి కుంటుంబానికి స్త్రీలే మూల స్థంభాలు, అందుకే స్త్రీ అనారోగ్యంతో ఉంటే కుటుంబం ఇబ్బంది పడుతుంది. అందుకే మహిళలు మీ ఆరోగ్యం జాగ్రత్త.

    గుండె ఆరోగ్యానికి ఏం చేయాలి?
    గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యం. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి. బరువును అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. రోజూ అరగంట పాటు వ్యాయామం/ బ్రిస్క్ వాక్ చేయండి. తగినంత నిద్ర అవసరం. రోజు 7-8 గంటల నిద్ర ముఖ్యం. ఒత్తిడిని తగ్గించడం ముఖ్యం. సో యోగా, ధ్యానం చేయండి. మద్యపానం, ధూమపానం మానుకోండి.