https://oktelugu.com/

Green Tomato: గ్రీన్ టమాటా ఎప్పుడైనా తిన్నారా? తింటే ఏమవుతుంది?

గ్రీన్ టమాటాలో విటమిన్ ఎ, సితో పాటు పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే బీటా కెరాటిన్ కంటి ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుంది. రోజూ ఒక పచ్చి టమాటా తినడం వల్ల కళ్లు సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 16, 2024 / 04:30 AM IST

    Green Tomato

    Follow us on

    Green Tomato: అందరి వంటింట్లో ఎప్పుడూ నిల్వ ఉండే కూరగాయల్లో టమాటా ఒకటి. దీనిని అన్ని కూరల్లోకి ఎక్కువగా వాడుతుంటారు. కొంతమంది అయితే టమాటా లేకుండా కూరలే వండరు. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ డైట్‌లో చేర్చుకోవడం వల్ల చర్మం కూడా కాంతిమంతంగా ఉంటుంది. వీటిని వండుకుని తినడం మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఫేస్ ప్యాక్ వేస్తుంటారు. అయితే సాధారణంగా చాలామంది పండిన టమాటాలను కూరలు లేదా పచ్చళ్లు చేసుకుని తింటుంటారు. కానీ పచ్చి టమాటాలను ఎవరు అంతగా తినడానికి ఇష్టపడరు. కొంతమందికి అయితే అసలు గ్రీన్ టమాటా ఉందని కూడా తెలియదు. పండని పచ్చిగా ఉన్న టమాటాలనే గ్రీన్ టమాటా అంటారు. పండిన టమాటాల కంటే పచ్చి టమాటాలోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. పచ్చి టమాటాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆ ప్రయోజనాలేంటో చూద్దాం.

    గ్రీన్ టమాటాలో విటమిన్ ఎ, సితో పాటు పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే బీటా కెరాటిన్ కంటి ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుంది. రోజూ ఒక పచ్చి టమాటా తినడం వల్ల కళ్లు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లను దూరం చేయడంతో పాటు క్యాన్సర్ పెరిగే కణాలను కూడ నిరోధిస్తుంది. పచ్చి టమాటాతో రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్స్ రోగనిరోధకశక్తిని పెంచుతాయి. గ్రీన్ టమాటాలో టొమాటిన్ అనే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, కార్డియో ప్రొటెక్టివ్, యాంటీ బయాటిక్ గుణాలను కలిగి ఉంటుంది. దీనివల్ల శరీరానికి పోషకాల శోషణను పెంచుతుంది. ఈ గ్రీన్ టమాటాను పచ్చిగా తినకూడదు. వండుకుని మాత్రమే తినాలి. ఎందుకంటే ఇందులో ఉండే సొలనిన్ కొన్నిసార్లు విషపూరితం కావచ్చు. కాబట్టి ఉడికించి లేదా వండుకుని మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

    పచ్చ టమాటాలో ఉండే డైటరీ ఫైబర్ గుండెకు రక్షణ కలిగిస్తుంది. అలాగే వాపు, కొలెస్ట్రాల్, శరీర బరువును తగ్గించడంలో సాయపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంతో పాటు మలబద్దకాన్ని నివారిస్తుంది. వీటిని తినడం వల్ల ముఖంపై ముడతలు పోయి యవ్వనంగా కనిపిస్తారు. జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు పచ్చి టమాటా వీటి నుంచి రక్షణ ఇస్తుంది. ఇందులో ఉండే ఫాస్ఫరస్ ఎసిడిటీ సమస్యకు విముక్తి ఇస్తుంది. మధుమేహం ఉన్నవాళ్లకు గ్రీన్ టమాటా బాగా ఉపయోగపడుతుంది. ఈ టమాటాతో ఎముకలు బలంగా పెరుగుతాయి. బోలు ఎముకల వ్యాధి నుంచి విముక్తి పొందాలంటే వీటిని రోజూవారి డైట్‌లో చేర్చుకోవడం మంచిది. వీటిని కేవలం చర్మానికి మాత్రమే మేలు చేయకుండా జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సాయపడతాయి. వీటిని ఏదో రకంగా రోజూ తింటే జుట్టు బలంగా ఉండటంతో పాటు దృఢంగా ఉంటుంది.