https://oktelugu.com/

Meat: మాంసాహారం ఎక్కువ తింటున్నారా? అయితే జాగ్రత్త

మాంసాహారంలో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చికెన్, మటన్, ఫిష్ వంటివి ఆరోగ్యానికి మంచివి. కానీ మితంగా తినాలి. అతిగా తినకూడదు అంటున్నారు నిపుణులు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 9, 2024 5:16 pm
    Meat

    Meat

    Follow us on

    Meat: చాలా మందికి ముక్కచుక్క ఉంటే చాలా ప్రీతి. కొందరికి ముక్కుండాల్సిందే. ఇలాంటి వారు వారంలో నాలుగైదు సార్లు కచ్చితంగా నాన్ వెజ్ ను తింటారు. కానీ అసలు తినకూడదు. ముక్కలేకపోతే ముద్దదిగని వారు ఎందరో ఉన్నారు. రోజు రోజుకు ఇలాంటి వారి సంఖ్య పెరుగుతుంది కూడా. కూరగాయల రేట్లు అమాంతం ఆకాశానికి ఎక్కడం, మాంసం ఎక్కువగా లభించడం వల్ల నాన్ వెజ్ ప్రియులు మరింత ఎక్కువ అవుతున్నారు. ఒకప్పుడు ఇంటికి చుట్టాలు వస్తేనే నాన్ వెజ్ చేసేవారు. లేదంటే పండగలకు నాన్ వెజ్ వండేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. వారం, చుట్టాలు, పండగలతో పని లేదు. తినాలి అనిపించిందా మాంసం రెడీగా ఉండాల్సిందే అంటున్నారు. దానికి తోడు హోటల్స్, రెస్టారెంట్లు అందుబాటులో ఉండటంతో ఈ అలవాటు మరింత పెరిగింది. మరి ఇంత ఎక్కువగా నాన్ వెజ్ తినవచ్చా? లేదా? అనే వివరాలు ఓ సారి చూసేద్దాం..

    మాంసాహారంలో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చికెన్, మటన్, ఫిష్ వంటివి ఆరోగ్యానికి మంచివి. కానీ మితంగా తినాలి. అతిగా తినకూడదు అంటున్నారు నిపుణులు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. మాంసాహారం రుచిగా ఉందని వారంలో నాలుగైదు రోజులు తింటే ఆరోగ్యానికి చేటే అంటున్నారు. అంతేకాదు తరచూ రెడ్ మీట్ తింటే ప్రమాదం ఎక్కువ ఉంటుందని.. కచ్చితంగా నాన్ వెజ్ ప్రియులు జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు.

    నాన్ వెజ్ మాత్రమే కాదు ఏదైనా సరే అతిగా తినడం మంచిది కాదు. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అతి మాంసాహారం తినడం వల్ల పెద్ద పేగుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. రెడ్ మీట్ ఎక్కువగా తినేవారిలో జీర్ణక్రియ సమస్యలు వస్తాయట. దీర్ఘకాలిక జీర్ణక్రియ సమస్యలు పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయట.

    రెడ్ మీట్ తో తీవ్ర అనారోగ్యాలు వస్తాయని..తరచూ తినేవారిలో గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుంది అంటున్నారు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందట. రెడ్ మీట్ ను నిరంతరం తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరుగుతుంది. ఊబకాయం కూడా వస్తుందట. అంతేకాదు రెడ్ మీట్ తినేవారిలో 46% డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికాలో అతిగా మాంసం తిని క్యాన్సర్ బారిన పడుతున్నారట. కడుపునొప్పి, మలబద్ధకం, వాంతులు, విరోచనాలు వంటి సమస్యలు అధికం అవుతున్నాయట. రెడ్ మీట్ ను అధికంగా తినే అమెరికాలో చాలామంది కొలొరెక్టల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని తెలుస్తోంది. 2024 సంవత్సరంలో సుమారు ఒకటిన్నర మిలియన్ల మందికి పెద్దప్రేగు క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయిందట.

    అధిక కొవ్వు మాంసంలో ఉంటుంది. కొవ్వు అసమతుల్యత ఏర్పడటానికి మాంసం కారణం అవుతుంది. తద్వారా కాలేయం-కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా వస్తుంటాయి. నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. ఇందులో ఫైబర్ తక్కువ ఉంటుంది కాబట్టి పేగుల్లో ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. కడుపులో ఆమ్లం పెరుగుతుంది. తద్వారా ఎముకలు, కీళ్లలో నొప్పి మొదలై అసౌకర్యం అనిపిస్తుంది. మాంసాహారం ఎక్కువగా తినాలనుకునేవారు.. దానితోపాటు తాజా కూరగాయలు, పండ్లు తినాలి. నాన్ వెజ్‌తో పాటు కూరగాయలు, సలాడ్‌లు ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ప్రోటీన్‌తో పాటు ఫైబర్ అందుతుంది. అందుకే కొన్ని సంవత్సరాల నుంచి, మొక్కల ఆధారిత ఆహారం గ్లోబల్ లేబుల్‌లపై ట్రెండింగ్‌లో ఉంది. మాంసాహారం వల్ల కేవలం నష్టం మాత్రమే కాదు ప్రయోజనాలు కూడా ఎక్కువే ఉన్నాయి. కానీ మితంగా మాత్రమే తినాలి. మరి మీరు కూడా మాంసాహార ప్రియులు అయితే జాగ్రత్త పాటిస్తూ తినేసేయండి.