Mahindra ev : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వినియోగం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఈవీలు బెటర్ గా ఉండడంతో చాలా మంది వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అటు ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ఎంకరేజ్ చేస్తుండడంతో కంపెనీలు ఈవీల ఉత్పత్తిపైనే ఫోకస్ పెడుతారు. ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. వీటిలో కొన్ని సక్సెస్ అయ్యాయి. మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. అయినా మిగతా కార్ల కంటే ఈవీలను మార్కెట్లోకి తీసుకురావడంతో తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని ఈవీలు కొత్తగా మార్కెట్లోకి వస్తుండగా..మరికొన్ని ఇప్పటికే ఉన్న కార్లను ఈవీలకు మారుస్తున్నారు. తాజాగ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన ఓ కారు త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. దీనికి సంబంధించిన ఫీచర్స్ కొన్ని బయటకు వచ్చాయి. వీటిని చూసి ఇంప్రెస్ అవుతున్నారు. అంతేకాకుండా ఈ కారు మార్కెట్లోకి వస్తే ఇతర కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మహీంద్రా కంపెనీ నుంచి ఎక్కువగా ఎస్ యూవీలే మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో థార్, XUV 300 ఫేస్ లిప్ట్ తదితర మోడల్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో XUV 300 ఫేస్ లిప్ట్ కు ఆదరణ ఉంది. ఇప్పుడు దీనిని ఈవీ వెర్షన్ లో తీసుకురాబోతున్నారు. XUV 300 ఫేస్ లిప్ట్ .. XUV 400 కంటే తక్కువ సేల్స్ ను నమోదు చేసుకున్నప్పటికీ ఈవీ వెర్షన్ లో ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త ఈవీ ఫీచర్స్ ఎలా ఉంటాయో చూద్దాం..
మహీంద్రా కార్లకు మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. ఈ కంపెనీ నుంచి ఎటువంటి కారు రిలీజ్ అయినా.. దాని గురించి ఆటోమోబైల్ వ్యాప్తంగా చర్చ ఉంటుంది. ఇందులో భాగంగా కొత్తగా రిలీజ్ కాబోనే XUV 300 ఫేస్ లిప్ట్ ఈవీ గురించి ఇప్పటికే చర్చలు ప్రారంభం అయ్యాయి. మార్కెట్లోకి వచ్చే ఈ ఈవీ XUV 300 ఫేస్ లిప్ట్ మాదిరిగానే హెడ్ ల్యాంప్ సెటప్, ఎల్ ఈడీ లైట్స్ ఉంటాయి. అయితే రీ డిజైన్ చేసిన గ్రిల్, భిన్నమైన బ్యాడ్జింగ్,బంపర్లసెట్ కూడా కొత్తగా ఉండనుంది. XUV 400 మోడల్ కంటే ఇది పొడవులో చిన్నగా ఉంటుంది. ఇందులో బూట్ స్పేస్ చిన్నగా ఉంటుంది.
కొత్త ఈవీలో 34.5 కిలో వాట్ల బ్యాటరీ సామర్థ్యాన్ని అందించారు. ఈ బ్యాటరీ ఛార్జింగ్ తో 375 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ఏసీతో పాటు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్టు చేస్తుంది. ఇందులో గరిష్టంగా 148 బీహెచ్ పీ పవర్, 310 ఎన్ ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ కారుకు సంబంధించి లాంచ్ డేట్ ను ఫీచర్స్, ధర తదితర విషయాలను అధికారికంగా ప్రకటించలేదు. కానీ త్వరలోనే ఈ కారు త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం చాలా కంపెనీలు ఈవీలపైనే ఫోకస్ పెడుతున్నాయి. అయితే అప్డేట్ వెర్షన్ తో ఎప్పటికప్పుడు కొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. మహీంద్రా నుంచి ఈవీ రావడం అంటే ఈ కంపెనీ ప్రియులకు శుభవార్తే అని అంటున్నారు. దీంతో ఈ కారు కచ్చితంగా సక్సెస్ అవుతుందని అంటున్నారు. XUV 300 ఫేస్ లిప్ట్ ఈవీనే కాకుండా మహీంద్రా నుంచి ఎక్స్ యూవీ 700 ఈవీ, థార్ ఈవీ, స్కార్పియో ఈవీలు కూడా త్వరలో రాబోతున్నాయి. అయితే వాటి అప్డేట్స్ అందాల్సి ఉంది.