Eating : ఈ పదార్థాలను రోజు తింటున్నారా? కచ్చితంగా స్కిప్ చేసేయండి..

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్న సంగతి తెలిసిందే. అందుకే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. అనారోగ్యంగా ఉన్నారంటే దానికి మెయిన్ కారణం ఆహారం అంటున్నారు నిపుణులు. ఇక మీరు ఆరోగ్యంగా ఉండాలంటే వెంటనే మీ ఆహారం నుంచి ఈ తెల్లని ఆహార పదార్థాలను దూరం చేసుకోవాలి. ఉరుకులు, పరుగుల జీవితంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అంతేకాదు ముఖ్యంగా చాలా మంది ఆహారం విషయంలో ఆసక్తి చూపించడం లేదు. శరీరం పట్ల జాగ్రత్త తీసుకోవడం లేదు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడినా.. ఆహారం విషయంలో మాత్రం రాజీ పడకుడదు అంటున్నారు నిపుణులు. అటువంటి పరిస్థితిలో, మీరు ఏదైనా తినడానికి ముందు ఆరోగ్యంపై దాని ప్రభావాల గురించి ఆలోచించాలి. లేదంటే కచ్చితంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

Written By: Swathi Chilukuri, Updated On : November 2, 2024 11:22 am

Eating these ingredients daily? Definitely skip it..

Follow us on

Eating : ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కచ్చితంగా తెల్లని ఆహారాలకు దూరంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. ఈ ఆహారాలు రుచికరంగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి విషమట. అయితే ఓ 5 వైట్ ఫుడ్స్ ను దూరం చేస్తే సగానిపైగా సమస్యలు దూరం అవుతాయట. ఆరోగ్యం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది అంటున్నారు నిపుణులు. అటువంటి 5 వైట్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తెల్ల చక్కెర: శరీరంలో మంట, కేలరీలు, లిపిడ్లు, చక్కెర స్థాయిని పెంచడానికి తెల్ల చక్కెర ప్రధాన పాత్ర వహిస్తుంది. దీన్ని అధికంగా తీసుకుంటే మాత్రం మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకు ఎన్నో ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.

తెల్ల రొట్టె: వైట్ బ్రెడ్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ ఇది ఆరోగ్యానికి సురక్షితం కాదు. ఇందులో ఫైబర్ అసలు ఉండదు. ఇక ఈ రొట్టె జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది. అంతే కాకుండా దీన్ని తినడం వల్ల షుగర్ పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.

తెల్ల బియ్యం: ప్రతి ఒక్కరు ఎక్కువగా అన్నం తింటారు. ఈ అన్నం గురించి అందులోని విటమిన్లు, మినరల్స్ గురించి కూడా చాలా సార్లు తెలుసుకునే ఉంటారు. ఇక ఈ అన్నానికి బదులు చపాతీలు తినడం బెటర్ అంటారు నిపుణులు. అన్నం చాలా తక్కువ తినాలని, దీనికి బదులు బ్రౌన్ రైస్ కూడా తినవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఈ తెల్ల బియ్యం కూడా శరీరానికి మంచివి కావట. అయితే పాలిష్ చేయడం వల్ల ఇందులోని చాలా పోషకాలు పోతాయి. ఇందులో అత్యధిక కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలను పెంచుతాయి.

తెల్ల ఉప్పు: ఉప్పు లేకుండా ఒక రోజు కూడా గడవదు కద. కూరలో ఉప్పు తక్కువ అయితే చాలు అన్నాన్ని పక్కన పెట్టేస్తుంటారు చాలా మంది. అయితే అధిక మోతాదులో తెల్ల ఉప్పు తీసుకుంటే మాత్రం అధిక రక్తపోటు, గుండె జబ్బులు వస్తాయి అంటున్నారు నిపుణులు. బదులుగా, సముద్రపు ఉప్పు లేదా పింక్ ఉప్పును ఉపయోగించండి.. ఇవి మరింత సహజమైనవి..

తెల్ల వెన్న: వైట్ బటర్ వంటి ప్రాసెస్ చేసిన కొవ్వులు కూడా గుండెకు హాని చేస్తాయి అంటున్నారు నిపుణులు. బదులుగా ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.