Vinayaka Chavithi 2024: వినాయక చవితి వచ్చింది. చిన్నా పెద్ద తేడా లేకుండా సెలబ్రేషన్స్ లో హుషారుగా పాల్గొంటారు. ఈ రోజున భోజన ప్రియుడికి రకరకాల పిండివంటలు చేసి నైవేద్యంగా పెడతారు. వీటితో పాటు కొన్ని రకాల పండ్లు కూడా ఆ వినాయకుడికి పెడుతుంటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ పండ్లు. ప్రజెంట్ జ్వరాలు, వైరల్ ఫీవర్స్ వస్తున్న విషయం తెలిసిందే.. ఈ సమయంలో ఆ బొజ్జ గణపతికి నైవేద్యంగా పెట్టే పండ్లు శరీరానికి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. ఇంతకీ ఆ పండ్లు ఏంటి అనుకుంటున్నారా?
వెలగపండు: దీనినే వుడ్ యాపిల్ అని పిలుస్తుంటారు. విటమిన్స్, కాల్షియం, టానిన్, ఫాస్పరస్, ఫైబర్, ప్రోటీన్, ఐరన్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండ్లు శరీర మూడుదోషాలని తగ్గించడంలో సహాయం చేస్తుంది. రక్త శుద్ధీకరణ జరిగి బాడీలోని విషాన్ని బయటికి పంపించడంలో సహాయం చేస్తుంది. ఇందులోని ఫైటో కెమికల్స్, ఫ్లేవనాయిడ్స్ గుండె, లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండ్లు తినడం వల్ల వివిధ ఇన్ఫెక్షన్స్ లకు చెక్ పెట్టవచ్చు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా కాపాడుకోవచ్చు. ఈ పండులో పేగులని శుభ్రపరిచే గుణాలు ఎక్కువ ఉంటాయట.. దీంతో మలబద్ధకం మాయం అవుతుంది.
జామ: పేదవాడి యాపిల్ పండ్లుగా పిలుస్తుంటారు. ధీని వల్ల షుగర్, క్యాన్సర్ సహా ప్రాణాంతక సమస్యలు దూరం అవుతాయి. జామపండ్లలో విటమిన్ సి నారింజ పండ్ల కంటే ఎక్కువ ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. అదే విధంగా వీటిని తినడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి గర్భిణీలకు చాలా మేలు చేస్తాయి. ఇందులోని గుణాలు ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థని అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తాయి. దీంతో పుట్టబోయే పిల్లలకి నాడీ వ్యవస్థ బలంగా మారుతుంది. జామలో లైకోపీన్, క్వెర్సెటిన్, విటమిన్ సి, ఎ, ఇతర పాలీఫెనాల్స్ లభిస్తాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తాయి. వీటి వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. జామపండ్లు తింటే మలబద్ధకం మాయం అవుతుంది. కంటిచూపు బెటర్ అవుతుంది. గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
అల్లనేరడి: జామూన్ ఫ్రూట్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో విటమిన్ ఎ, సి, కె లు లభిస్తాయి. ఈ అల్లనేరేడు పండ్లలో పొటాషియం, కాపర్, మాంగనీస్ లభిస్తుంది. ఇందులోని ఫైబర్ కారణంగా మలబద్ధకం దూరం అవుతుంది. ఈ పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగు అవుతాయి అంటున్నారు నిపుణులు. ఈ పండ్లని రెగ్యులర్‌గా తింటే బీపి ని సమపాళ్లలో ఉంచుకోవచ్చు. కొలెస్ట్రాల్ కూడా తగ్గుముఖం పడుతుంది. ఇందులో తక్కువ కేలరీలు లభిస్తాయి కాబట్టి హెల్దీ స్నాక్ ఐటెమ్ గా కూడా తీసుకోవచ్చు. బరువు తగ్గించడంలో సహాయం చేస్తాయి.
సీతాఫలం: సీతాఫలాల్లో విటమిన్ ఎ, బి6, సిలు ఉంటాయి. ఇందులోని ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, కౌరేనోయిక్ యాసిడ్, విటమిన్ సి లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. క్యాన్సర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఇందులో విటమిన్ బి6 ఉండడం వల్ల మానసిక సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
అరటిపండ్లు: అరటిపండ్లలో పొటాషియం, ఫైబర్, విటమిన్స్ ఎ, సి, బి6, మెగ్నీషియం, ఫోలేట్, రైబోఫ్లేవిన్, నియాసిన్, ఐరన్‌లు వంటివి పుష్కలంగా లభిస్తాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇవి మంచి ఔషధంగా పని చేస్తాయి. అరటిపండ్లలోని కార్బోహైడ్రేట్స్, కొవ్వులు జీవక్రియకు బెటర్ గా పని చేస్తాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.