https://oktelugu.com/

Horoscope Today : నవ పంచమి కారణంగా ఈ రాశుల వారికి అధిక లాభాలు..

సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భార్యభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల కీలక నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయి. గ్రహాల కదలికలో మార్పుల కారణంగా ఈ రాశి వారి జీవితంలో మార్పులు ఉంటాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : September 17, 2024 / 07:44 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వభద్రా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు నవ పంచమి కారణంగా కొన్ని రాశుల వ్యాపారులకు శుభ ఫలితాలు ఉండనున్నాయి. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అయితే కొన్ని రాశుల వారికి అదనంగా ఖర్చులు ఉంటాయి. మేషం నుంచి మీనం వవరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    కుటుంబ విషయాల్లో తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. కొన్ని పనులు ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది. మానసిక క్షోభ కారణంగా ఆనారోగ్య సమస్యలు వస్తాయి. వ్యాపారులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

    వృషభ రాశి:
    వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో మనసు ప్రశాంతంగా మారుతుంది. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    మిథున రాశి:
    కొందరు శత్రువులతో హాని ఏర్పడే అవకాశం. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడుతారు. వ్యాపారులకు ఈరోజు లాభాలు ఉంటాయి. మితిమీరిన ఖర్చులు ఇబ్బందులకుగురి చేస్తాయి.

    కర్కాటక రాశి:
    కుటుంబ సభ్యులు కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ వ్యాపారం చేసేవారు శుభవార్తలు వింటారు. మహిళలు కొన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. పూర్వీకుల ఆస్తిపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    సింహారాశి:
    ఉద్యోగులు అధికారులతో సమన్వయంతో పనిచేయాలి. చిన్నపాటి గందరగోళం కారణంగా మనసు గందరగోళంగా మారుతుంది. ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలి. వ్యాపారులు మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు.

    కన్య రాశి:
    సమాజంలో గౌరవం పెరుగుతుంది. సాయంత్ర ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. కుటుంబ వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. మధ్యవర్తులు చెప్పే మాటలు నమ్మొద్దు. ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి.

    తుల రాశి:
    వ్యాపారులు లాభదాయకమైన ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్యం కోసం ఖర్చులు చేస్తారు. సమస్యలు పునారవృతం కాకుండా ప్రణాళిక రూపొందించాలి. కుటుంబ వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది.

    వృశ్చిక రాశి:
    వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. సాయంత్రం కటుుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. కొన్ని రంగాల వారు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు.

    ధనస్సు రాశి:
    సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భార్యభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల కీలక నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయి. గ్రహాల కదలికలో మార్పుల కారణంగా ఈ రాశి వారి జీవితంలో మార్పులు ఉంటాయి.

    మకర రాశి:
    అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఖర్చులను నియంత్రించాలి. ఆర్థిక పరంగా పుంజుకుంటారు. ఉద్యోగులు అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉండాలి. ప్రభుత్వ పనుల కోసం ఎదురుచూసేవారికి నేటితో పూర్తవుతాయి.

    కుంభరాశి:
    ఆర్థికంగా లాభాలు ఎదుర్కొంటారు. సాయంత్రం స్నేహితులతో గడుపుతారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణిస్తుంది. కుటుంబ సభ్యుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    మీనరాశి:
    ఆదాయం కోసం తీవ్రంగా కష్టపడుతారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతుతో కష్టాలు తీరుతాయి.