Banana Leaves: అరటి ఆకులలో భోజనం చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి

శరీరానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. నేచురల్ యాంటీ ఆక్సిడెట్స్‌గాను పనిచేస్తుంటాయి అరటిఆకులు. ఇందులో ఉండే వ్యాధి నిరోధక గుణాలు సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి.

Written By: Swathi, Updated On : June 4, 2024 3:54 pm

Banana Leaves

Follow us on

Banana Leaves: అరటి ఆకులలో భోజనం చేస్తుంటారు భారతీయులు. ఇదొక సంప్రదాయమైన పద్దతి. అంతేకాదు దక్షిణాది ప్రజలు పాత్రలకు బదులుగా అరటి ఆకులలోనే ఎక్కువగా తింటారు. ఇది చాలా ఆరోగ్యకరం. అంతేకాదు చాలా వ్యాధులకు నివారిణి అరటిఆకులు. ఇందులో సహజ సిద్ధమైన కర్బన సమ్మేళనాలు ఉంటాయి. ఇందులో భోజనం చేస్తే ఈ సహజమైన కర్బన సమ్మేళనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి అంటున్నారు నిపుణులు. ఈ అరటి ఆకులు కేన్సర్, గుండె జబ్బులను నిరోధిస్తాయట.

శరీరానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. నేచురల్ యాంటీ ఆక్సిడెట్స్‌గాను పనిచేస్తుంటాయి అరటిఆకులు. ఇందులో ఉండే వ్యాధి నిరోధక గుణాలు సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. అంతేకాదు ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. అవేంటంటే? అరటి ఆకుల్లో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఆహారంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడతాయి. అందుకే అరటి ఆకులపై ఆహారం తినడం వల్ల ఫుడ్ ద్వారా వచ్చే వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

అరటి ఆకులలో పాలీఫెనాల్స్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు చాలా ఉన్నాయి. అరటి ఆకుపై ఆహారాన్ని ఉంచినప్పుడు, ఈ పోషకాలలో కొన్ని ఆహారంలోకి వెళ్లి, దాని పోషణను మెరుగుపరుస్తాయి. కొన్ని సింథటిక్ ప్లేట్లు మాదిరి ఇవి అసలు విషపూరితం కాదు. అరటి ఆకులో ఆహారం ఆరోగ్య కరమైన రసాయనాలను విడుదల చేస్తుంది కాబట్టి ఆహారం సురక్షితంగా ఉంటుంది. డిస్పోజబుల్ ప్లేట్‌లకు బదులుగా అరటి ఆకులను ఉపయోగించడం చాలా మంచిది. ఇవి పర్యావరణ అనుకూలమైనవి కూడా.

వీటిని శుభ్రపరచడం తేలిక. మంచి నీటిలో కడిగి దీన్ని ఉపయోగించాలి. తేలికగా భూమిలో కలిసిపోతాయి కాబట్టి పర్యావరణ హితమైనది కూడా. అంతేకాదు దీని వల్ల జీర్ణక్రియపై మంచి ప్రభావం చూపుతుంది. అరటి ఆకులలో ఉండే పాలీఫెనాల్స్ జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి. ప్లాస్టిక్ పాత్రలలో వేడి ఆహారాన్ని అందించడం వల్ల కొన్ని ప్లాస్టిక్ కణాలు ఆహారంలోకి వస్తుంటాయి. కానీ యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు అరటి ఆకులలో ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.