Venu Swamy: మనుషుల జాతకాలు చెబుతూ వారికి భవిష్యత్ లో ఏం జరుగుతుందో చెప్పే వేణు స్వామి తాను తప్పుడు ప్రకటన చేశానని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికలపై తాను చెప్పిన విధంగా కాకుండా వ్యతిరేక ఫలితాలు వచ్చాయని, ఇది వంద శాతం తప్పని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అంతేకాకుండా ఇన్నాళ్లు నాకు సహకరించిన వారికి ధన్యవాదాలు అని చెప్పారు. దీంతో ఆయన మరోసారి సెలబ్రెటీల జాతకాలు చెప్పరా? అన్న వాదన వినిపిస్తోంది.
సినీ రంగానికి చెందిన ప్రముఖుల జాతకాలు చెప్పి ఫేమస్ అయిన వేణు స్వామి.. ఆయన చెప్పిన ప్రతీ మాట నిజం అవుతుందని కొందరు నమ్ముతారు. పెళ్లి చేసుకున్న సమయంలోనే వారు విడిపోతారని వేణు స్వామి చెప్పారు. ఆ తరువాత వారు విడిపోవడంతో వేణు స్వామి చెప్పింది నిజమవుతుందని కొందరు నమ్మారు. ఆ తరువాత కొందరు ప్రముఖుల జాతకాలు కూడా వేణు స్వామి బయటపెట్టారు. అయితే తాజాగా ఏపీ రాజకీయాల గురించి వేణు స్వామి జోష్యం చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో మరోసారి జగన్ అధికారంలోకి వస్తారని అన్నారు. అలాగే కేంద్రంలో మోదీ హవా తగ్గుతుందని చెపపారు. అయితే జూన్ 4న విడుదలయిన ఫలితాల్లో ఏపీలో కూటమి దూసుకెళ్లింది. కనీస సీట్లు కూడా వైసీపీ గెలుచుకోలేకపోయింది. దీంతో వేణు స్వామిపై కొందరు అప్పుడే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలు పెట్టారు. అయితే వెంటనే వేణు స్వామి ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ..
‘నేను చెప్పిన రెండు విషయాల్లో ఒకటి నిజం అయింది.మరొకటి తప్పింది. ఇందులో కేంద్రంలో మోదీ హవా తగ్గుతుందని అన్నాను. అనుకున్నట్లుగానే ఆయనకు సీట్లు తగ్గాయి. కానీ ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పాను. కానీ కూటమి విజయం సాధించింది. నేను మనుషుల జాతకాలను బట్టి మాత్రమే నాకున్న జా్ఓనంతో చెప్పగలుగుతారు. ఏపీ విషయంలో నేను చెప్పింది. 100 శాతం తప్పు.. ఇంతకాలం నాకు సహకరించన వారికి ధన్యవాదాలు’ అని చెప్పారు. అయితే భారీ తప్పిదాన్ని ఒప్పుకున్న వేణు స్వామి ఇక జాతకాలు చెప్పినా ఎవరూ నమ్మరని కొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.