Coriander: కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని విటమిన్ ఎ కళ్లకు చాలా మేలు చేస్తుంది. ఇందులోని సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజు కాస్త కొత్తిమీర తినడం వల్ల మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతాయి.
అజీర్ణం, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడుతాయి. ఇది ముడతలు, వృద్ధాప్య ఛాయలను నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాదు చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి మంచిది కొత్తిమీర.
కొత్తిమీర లో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కొత్తిమీర లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో కూడా సహాయపడుతాయి. అంతేకాదు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
జుట్టు రాలడాన్ని, జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. చూశారుగా కొత్తిమీర వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. రోజు మీ డైట్ లో ఈ కొత్తిమీరను ఉపయోగించండి. ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది సహాయం చేస్తుంది కాబట్టి.. క్రమం తప్పకుండా వాడండి.