Earth: భూమి ఎప్పుడు పుట్టిందో తెలుసా.. ఇప్పుడు భూమి వయసు ఎంతో తెలుసా. ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఈ రహస్యం ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. విశ్వంలో దాగిఉన్న రహస్యాలను ఛేదిస్తున్నారు. ఈ క్రమంలో భూమి గురించి కూడా కొన్ని ప్రయోగాలు చేసి భూమి వయసు కనుగొన్నారు. ప్రస్తుతం భూమి వయసు 4.5 బిలియన్ ఏళ్లకంటే ఎక్కువే అని తేల్చారు. ఇకభూమి ఉద్భవించినప్పుడు ఎలాంటి జీవరాశి లేదని పేర్కొన్నారు.
మానవ పుట్టుకకు ముందే..
ఇక భూమిపై మానవుడి పుట్టుకకు ముందే చెట్లు, నదులు, పర‍్వతాలు, వివిధ రకాల జంతువులు ఉన్నాయని పరిశోధనలో గుర్తించారు. ఈ క్రమంలోనే మానవుడు ఉనికిలోకి వచ్చారని తెలిపారు. క్రమంగా మానవ జనాభా పెరిగి ప్రపంచంలో ప్రతీ మూలను పాలించే స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించారు. కోతి నుంచి పుట్టిన మనిషి ఎంతో అభివృద్ధి చెంది ఇప్పడు మర మనుషులనే తయారు చేస్తున్నాడు. భూమి వెలుపల ఉండే అంతరిక్షంలోకి ప్రయాణించడం ప్రారంభించాడు. నేడు విశ్వవ్యాప్తంగా కంప్యూటర్లు ఉపయోగిస్తున్నారు. వీటిసహాయంతో ఎన్నో అంచనాలు వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
టెక్నాలజీలో ముందంజ..
భూమి పుట్టుకను ఛేదించే పరిశోధనలతోపాటు అనేక అంశాల్లో మానవుడు సాంకేతికతను వినియోగిస్తున్నారు. టెక్నాలజీలో ముందు వరుసలో ఉన్నాడు. ఇంటి పనులు మొదలుకుని, కృత్రిమ మేధస్సును ఉపయోగించడం వరకు ప్రతీ పనికి యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది శాస్త్రవేత్తలు మానవులు ఎప్పుడు ఉనికిలో లేకుండా పోతారు అన్న అంచనాలను వేయడానికి కూడా సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
కంప్యూటర్ మోడలింగ్ సాయంతో..
మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని శాస్త్రవేత్తల బృందం జనాభా, సహజ వనరులు, శక్తి వినియోగం వంటి అంశాలపై బహుళ డేటా నమూనాలు పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనిద్వారా మానవ మనుగడను అంచనా వేస్తున్నారు. ఇందుకు కంప్యూటర్ మోడలింగ్‌ను ఉపయోగించి వెబ్‌సైట్ లాడ్ బైబిల్ నివేదిస్తుంది. క్లబ్ ఆఫ్ రోమ్ ప్రచురించిన అధ్యయనం, రాబోయే ‘పరిణామానికి పరిమితుల’ ను తెలుపుతుంది.
పతనం అప్పుడే..
ఈ పరిశోధనల ద్వారా 21వ శతాబ్దం మధ్యలో సమాజం పతనం అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం మానవజాతి అంతరించడానికి ఇంకా రెండు దశాబ్దాల కన్నా తక్కువ సమయమే ఉందని చెబుతున్నారు. కచ్చితమైన లెక్కలు వేస్తే 2040లో పతనం జరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే ఇంకా 17 ఏళ్లలో మానవ జాతి పతనం అవుతుంది అని చెబుతున్నారు.