Shamshabad Airport : మాజీ ఐటి ఉద్యోగి.. ఏకంగా విమానాశ్రయానికి బాంబు పెట్టాడు..!

బెదిరింపు మెయిల్‌ పంపిన వైభవ్‌ను పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇతను 2012 నుంచి 2020 వరకు ఐటీ ఉద్యోగిగా పనిచేసినట్లు గుర్తించారు.

Written By: NARESH, Updated On : February 20, 2024 2:26 pm
Follow us on

Shamshabad airport : హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్‌ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం ఉదయం విమానాశ్రయంలో ఆర్డీఎక్స్‌ దాడి జరుగుతుందని ఈ మెయిల్‌ రావడంతో సిబ్బంది హై అలర్ట్‌ అయ్యారు. అధికారులు విచారణ జరిపారు. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. బాబు లేదని నిర్ధారణ అయిన తర్వాత అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మెయిల్‌పై విచారణ..
ఇక ఈ అనామక మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందని అధికారులు తర్వాత విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఇది ఓ మాజీ ఐటీ ఉద్యోగి పనిగా గుర్తించారు. అని పేరు వైభవ్‌ తివారిగా పోలీసులు తెలిపారు. ‘హైజాకర్‌ మిమ్మల్ని హత్య చేసేందుకు అంతర్జాతీయ విమానాశ్రయం తలుపులు తెరవకండి’ అనే పదాలతో కూడిన ఇమెయిల్‌ను అతడు పంపించాడు. దీంతో అతడి అడ్రస్‌ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణ..
బెదిరింపు మెయిల్‌ పంపిన వైభవ్‌ను పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇతను 2012 నుంచి 2020 వరకు ఐటీ ఉద్యోగిగా పనిచేసినట్లు గుర్తించారు. కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయాడని తెలిసింది. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన వైభవ్‌ ఎయిర్‌ పోర్టులు, రద్దీ ప్రదేశాలు ఉండే ప్రాంతాలు, లేదా సంస్థలకు బెదిరింపు మెయిల్స్‌ పంపుతున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు అతను 200కు పైగా ఇలాంటి బెదిరింపు మెయిల్స్‌ పంపినట్లు నిర్ధారించారు.