https://oktelugu.com/

Bigg Boss Telugu 8: టాప్ 5 లో ఉండాల్సిన హరితేజ ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే..బిగ్ బాస్ టీం కావాలని తొక్కేసిందా ?

హరితేజ లో ఇన్ని రోజులు మనం ఎప్పుడూ చూడని కోణాలు ఈ సీజన్ లో చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈమె ఇతర కంటెస్టెంట్స్ గురించి మరో కంటెస్టెంట్ వద్ద తప్పుగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నయనీ పావని తో ఎప్పుడూ ఈమె అదే చేస్తూ ఉండేది. రోహిణి, అవినాష్ మీద హద్దులు దాటిన అసూయ చూపడం తో పాటు, కంటెస్టెంట్స్ మధ్య సైలెంట్ గా పుల్లలు పెట్టడం వంటివి చేస్తూ ఉండేది.

Written By:
  • Vicky
  • , Updated On : November 11, 2024 / 07:47 AM IST

    Bigg Boss Telugu 8(212)

    Follow us on

    Bigg Boss Telugu 8: నిన్న బిగ్ బాస్8 నుండి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన హరితేజ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సీజన్ 1 లో టాప్ 3 వరకు వచ్చిన ఈమె, సీజన్ 8 లో మాత్రం కేవలం ఆరు వారాలు మాత్రమే కొనసాగింది. ఇంత తొందరగా ఆమె ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో మొదటి కారణం ఆమె మీద అంచనాలు విపరీతంగా ఉండడం. మొదటి సీజన్ లో ఈమె ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రమే కాకుండా, టాస్కులు కూడా అద్భుతంగా ఆడేది. కానీ ఈ సీజన్ లో ఆమెకి టాస్కులు ఆడే అవకాశాలు ఎక్కువగా రాలేదు. కానీ అవకాశం వచ్చినప్పుడల్లా టాస్కులు బాగానే ఆడింది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి కూడా చాలా వరకు ప్రయత్నం చేసింది కానీ, ఎందుకో అది మొదటి సీజన్ లో లాగా క్లిక్ అవ్వలేదు. మణికంఠ మీద చెప్పిన హరికథ కి కాస్త మంచి రెస్పాన్స్ వచ్చింది.

    ఇదంతా పక్కన పెడితే హరితేజ లో ఇన్ని రోజులు మనం ఎప్పుడూ చూడని కోణాలు ఈ సీజన్ లో చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈమె ఇతర కంటెస్టెంట్స్ గురించి మరో కంటెస్టెంట్ వద్ద తప్పుగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నయనీ పావని తో ఎప్పుడూ ఈమె అదే చేస్తూ ఉండేది. రోహిణి, అవినాష్ మీద హద్దులు దాటిన అసూయ చూపడం తో పాటు, కంటెస్టెంట్స్ మధ్య సైలెంట్ గా పుల్లలు పెట్టడం వంటివి చేస్తూ ఉండేది. ముఖ్యంగా విష్ణు ప్రియా, పృథ్వీ , అలాగే పృథ్వీ, టేస్టీ తేజ మధ్య పుల్లలు పెట్టే ప్రయత్నం చేసింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఆమె హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుండి చేస్తున్న పని ఇదే. అందుకే సోషల్ మీడియా ద్వారా బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకుంది. ఆ నెగటివిటీ ని చూసిన తర్వాత ఈ అమ్మాయి అనవసరంగా ఈ సీజన్ లోకి వచ్చింది అని అందరికీ అనిపించింది.

    ఎందుకంటే హరితేజ ఇప్పుడు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న నటి. రీసెంట్ గా విడుదలై సంచలన విజయం సాధించిన ఎన్టీఆర్ పాన్ ఇండియన్ చిత్రం ‘దేవర’ లో కూడా ఆమె ఒక కీలక పాత్ర పోషించింది. కేవలం ఈ ఒక సినిమా మాత్రమే కాదు, అనేక సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా ఉండే ఈమెకి బిగ్ బాస్ లోకి రావాల్సిన అవసరం ఉండేది కాదు. బయటకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్ లో పాల్గొన్న ఆమెకు, హోస్ట్ అర్జున్ ఆమెపై సోషల్ మీడియాలో వచ్చిన నెగటివ్ కామెంట్స్ ని చూపించాడు. ఇవి చూసి పాపం ఆమె చాలా ఫీల్ అయ్యింది. ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న పేరు కేవలం ఒక్క నెలరోజుల్లోనే చెడిపోయింది, మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి చాలా సమయం పడుతుంది అంటూ చెప్పుకొచ్చింది.