Health Tips: ఎండ వేడి నుంచి ఉపశమనం, నోటి దుర్వాసన నుంచి ఉపశమనం పొందాలంటే ఇవి తినండి..

వేడి రోజులలో పుదీనా ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పెరుగుతాయి. అంతే కాదు, పుదీనా ఆకులు చాలా సువాసనతో నిండి ఉంటాయి.

Written By: Swathi, Updated On : May 10, 2024 5:17 pm

Health Tips

Follow us on

Health Tips: చాలా మంది నోరు దుర్వాసన వస్తుంటుంది. ఈ దుర్వాసన వల్ల నలుగురిలో మాట్లాడాలంటే కూడా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అయితే ఈ వాసనను పోగొట్టేలా మార్కెట్ లో కొన్ని టూత్ పేస్టులు, మౌత్ వాష్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ మనం నాచురల్ గా కూడా ఈ స్మెల్ ను పోగొట్టేలా చేసుకోవచ్చు. ఇందులో పుదీనా వాసన , రుచి వస్తుంది. పిప్పరమింట్ నోటి దుర్వాసనకు మంచి నివారణగా పని చేస్తుంది. అంతేకాదు పుదీనా ఆకు మైండ్ ను చురుకుగా ఉంచడంలో బాగా ఉపయోగపడుతుంది.

వేడి రోజులలో పుదీనా ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పెరుగుతాయి. అంతే కాదు, పుదీనా ఆకులు చాలా సువాసనతో నిండి ఉంటాయి. దీని వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. దీని వల్ల మనిషి చాలా షార్ప్ గా పని చేసుకోగలరు. అయితే ఓ రెండు పచ్చి పుదీనా ఆకులను తినమని సలహా ఇస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం కష్టతరంగా మారింది. ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నారు చాలా మంది కొందరు మాత్రమే ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారు. చాలా అత్యవసరం అయితేనే వెళ్తున్నారు కానీ లేదంటే ఇంట్లో నుంచి బయటకు వెల్లడం లేదు. మీరు కూడా బయటకు వెళ్లాలి అనుకుంటే పుదీనా ఆకులను తినండి. దీని వల్ల మీ శరీరం చల్లబడుతుంది.

ఎండాకాలంలో అజీర్ణం సమస్యలు పెరుగుతాయి కాబట్టి.. పుదీనా ఆకుపచ్చ ఆకులు జీర్ణవ్యవస్థ కండరాలను సడలించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే నోటి దుర్వాసన ఉన్నవారు రోజూ రెండు పుదీనా ఆకులను నమలాలి. దీని వల్ల నోటి దుర్వాసన కూడా పోతుంది.