foods : శీతాకాలం వచ్చేసింది. వామ్మో చలి కూడా చాలా ఉంది. ఉదయం లేవాలంటే ఫుల్ కష్టంగా ఉందా? మధ్యాహ్నం అయినా సరే చలి పోవడం లేదు కదా. ఇక సాయంత్రం అవుతుంటే అబ్బో చాలా భయంగా అనిపిస్తుంటుంది. బయటకు వెళ్లాలంటే భయం, లేవాలంటే భయం, కూర్చోవాలంటే కష్టం, అదేనండి చలి పులి కాస్త ఇబ్బంది పెట్టేస్తుంది. ఇక కాస్త ఆహారం చల్లగా అయితే మాత్రం బాస్ ముద్ద నోట్లోకి వెళ్లదు. వేడి వేడి ఆహారం తింటేనే కాస్త హాయిగా అనిపిస్తుంది. ఇక ఈ సమయంలో మనలో చాలా మంది ఆహారంలో మార్పులు చేసుకుంటున్నారు. అయితే ఈ చలికాలంలో తినాల్సిన ఆహారాల గురించి ఓ సారి చూసేద్దాం.
గుర్ పోహా ఈ చలికాలంలో మంచి ఆహారం. బెల్లం కొబ్బరితో మీ పోహాకు తీపి ట్విస్ట్ ఇవ్వండి. గుర్ పోహా అనేది మీరు ప్రయత్నించాల్సిన ఆరోగ్యకరమైన వంటకం. ఇక తేఫా కూడా టేస్ట్ చేయాల్సిన వంటకం. ప్రస్తుతం చాలా రకాల ఆకు కూరలు ఈ సీజన్‌లో అందుబాటులో ఉన్నాయి. మీరు మెంతి ఆకులతో ఆరోగ్యకరమైన తేప్లాలను తయారు చేసుకోండి. మంచి పోషకాలు నిండిన అల్పాహారం కోసం ఇదొక గొప్ప ఆలోచన. పాలక్ పరాటా కచ్చితంగా ట్రై చేయండి. బచ్చలికూర (పాలక్) మీరు మీ అల్పాహారంలో చేర్చగలిగే మరొక పోషక పదార్ధం. ఈ పాలక్ పరాఠా తినడానికి సూపర్ గా ఉంటుంది. పోషకాలతో నిండిన ఈ పాలకూర స్పెషల్ ను కచ్చితంగా ట్రై చేయండి.
బీట్‌రూట్ చీలా మీకు తెలుసా? జై యూట్యూబ్ అనండి బాస్. ఒకసారి ట్రై చేస్తే మీకు మంచి ప్రయోజనాలు అందుతాయి. బీట్‌రూట్ సహాయంతో మీ రెగ్యులర్ చీలాకు అదనపు పోషకాలను జోడించవచ్చు. ఇది రుచికరమైన శీతాకాలపు అల్పాహార వంటకం అని చెప్పవచ్చు. మీకు చాలా నచ్చుతుంది. అంద మేతి భుర్జీ కూడా మీరు ట్రై చేయవచ్చు. టిఫిన్ ను గుడ్లు లేకుండా చేయలేరా ఏంటి? చేయవచ్చండి? పాత పద్ధతిలో భుర్జీని తయారు చేయకుండా, దానికి మెంతి (మెంతి ఆకులు) వేసి ట్విస్ట్ ఇవ్వండి. సూపర్ గా ఉంటుంది.
చికెన్ ఆమ్లెట్ సూపర్ గా ఉంటుంది. ఇక ఈ చలికాలంలో మీకు మంచి టేస్ట్ ను అందిస్తుంది. మీరు తప్పక ప్రయత్నించాల్సిన అల్పాహారం కోసం మరొక ఎగ్ వంటకం కూడా అవచ్చు. చికెన్, ఎగ్ లతో తయారు చేసే టిఫిన్ మీకు ప్రొటీన్ ను అందిస్తుంది. మంచి టేస్ట్ ఉంటుంది. సర్వపిండి తెలుసు కదా తెలంగాణ సూపర్ వంటకం. వేడి వేడిగా ఉన్నప్పుడు చల్లని సాయంత్రాన్ని ఈ సర్వపిండితో ఆస్వాదించండి. బజ్జీలు కూడా బాగా ఉంటాయి. మిర్చీలు తింటే చల్లని సాయంత్రం కూడా అందంగా వేడి వేడిగా అవుతుంది.సో ట్రై చేయండి.