Tirupathi: ఆమెకు ఇటీవల వివాహం జరిగింది. కాకపోతే భర్తకు దూరంగా ఉంటున్నది. పెళ్లి పెడాకులు కావడంతో మరొకరితో సహజీవనం మొదలు పెట్టింది.. ఇటీవల ఏం జరిగిందో తెలియదు కాని… ఆమె ప్రియుడు దూరం పెడుతున్నాడు. గతంలో మాది దగ్గరికి రావడం లేదు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉండడంతో.. ఇంతకుముందు లాగా ఆమెకు సుఖాన్ని ఇవ్వడం లేదు. తన ప్రియుడిని మర్చిపోలేక.. ఏకంగా తన వద్దకు రప్పించుకోవడం కోసం భారీ ప్రణాళిక రూపొందించింది. అయితే ఇది కాస్త సంచలనంగా మారింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లిలో జరిగింది. తూర్పు తిరుపతి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.. చిత్తూరు జిల్లా పరిధిలోని మదనపల్లి ప్రాంతానికి చెందిన సోనియా అనే యువతికి.. తిరుపతికి చెందిన ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అది కాస్త వారిద్దరి మద్య సహజీవనానికి దారి తీసింది. అయితే సోనియాకు వివాహం జరగడం.. భర్తకు దూరంగా ఉండడం వంటి విషయాలను ఆ యువకుడు తెలుసుకొన్నాడు.. కొద్ది రోజులుగా సోనియాతో దూరం పాటిస్తున్నాడు.. అతడు దూరంగా ఉండటం సోనియాకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో అతడిని తన వద్దకు రప్పించుకునేందుకు భారీ ప్రణాళిక రూపొందించింది. దీనికోసం కిడ్నాప్ ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. అతడిని అపహరించి తన వద్దకు రప్పించుకోవాలని భావించింది. దీనికోసం భారీగానే ఖర్చు పెట్టింది.
ఐదుగురితో కిడ్నాప్
ఇందులో భాగంగా ఐదుగురితో అతడిని కిడ్నాప్ చేయించేందుకు భారీ స్కెచ్ వేసింది. అయితే ఆ యువకుడిని సోనియా డీల్ కుదుర్చుకున్న ఐదుగురు కిడ్నాప్ చేస్తుండగా.. ఆ యువకుడి స్నేహితులు గమనించారు.. తనను కాపాడాలని ఆ యువకుడు కేకలు వేస్తుండగా.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. హోరాహోరీగా జరిగిన ఈ ఆపరేషన్ లో చివరికి పోలీసులు వాయల్పాడు వద్ద కిడ్నాపర్లను అడ్డగించారు. ఆ యువకుడిని రక్షించారు..పోలీసుల విచారణలో ఆ కిడ్నాపర్లు అసలు విషయం చెప్పడంతో ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో సోనియా పై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు.. అతడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సోనియా పై కేసు నమోదు చేశారు.. ప్రస్తుతం విచారణ జరుగుతున్నది.. ” నేను ఆ యువకుడు కొద్దిరోజులుగా కలిసి ఉంటున్నాం. అతడు ఈ మధ్య నన్ను దూరం పెడుతున్నాడు. అది నాకు నచ్చడం లేదు. ఎంత ట్రై చేసినా అతడు నా వద్దకు రావడం లేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. అతడిని ఎలాగైనా నాతోపాటు ఉండేలా చేయాలని”సోనియా పోలీసుల ఎదుట వాపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆ యువకుడు ఆమెతో ఉండడానికి నిరాకరించినట్టు తెలుస్తోంది. ఆ యువకుడి తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్ కు పిలిపించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.