Hair Growth Foods: శిరోజాలకు సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు మహిళలు. జుట్టు రాలడం, తెల్లగా మారడం, పల్చగా అవడం, చిట్లడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ఖరీదైన షాంపూలు, కండీషనర్లను వాడుతున్నారు. కానీ ఫలితం శూన్యమే అని చెప్పాలి. అయితే జుట్టు పెరగాలంటే ఏం చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
అయితే జుట్టు పెరగాలి అంటే ప్రోటీన్ అవసరం. ముఖ్యంగా కెరటిన్ అనే ప్రోటీన్ కావాలి. అందుకే ఈ ప్రోటీన్ ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. సమస్య తెలుసుకున్న తర్వాత దానికి ప్రత్యామ్నాయాలను తెలుసుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. అందుకే ఈ ప్రోటీన్ ఉండే ఓ ఐదు ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎరువు వేస్తే మొక్క ఎలా ఎదుగుతుందో ఈ ప్రోటీన్ ఉండే ఆహారాలను తీసుకుంటే కూడా మీ జుట్టు చాలా బాగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా సోయా గింజలు బెటర్. ఇందులో కెరటిన్ అనే ప్రోటీన్ 44 శాతం ఉంటుంది. ఆ తర్వాత చెప్పుకొదగ్గవి పుచ్చగింజలు. ఇందులో 34 శాతం ప్రోటీన్ ఉంటుంది. ఇక ఎంపసీడ్స్ లో 32శాతం ఉంటుంది. చట్నీలుగా లేదా ఉడకబెట్టుకొని వేయించుకొని తినేవి వేరుశనగలు. ఇందులో 25 శాతం ప్రోటీన్ ఉంటుంది. అందరికీ ఇష్టమైన బాదం లో కూడా 23 శాతం ప్రోటీన్ ఉంటుంది.
ఈ ఆహారాలను తినడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు చాలా పెరుగుతుంది కూడా. మరి కుదిరితే వీటిని మీ డైట్ లో చేర్చుకోండి. కండీషనర్లు, షాంపూలకు అధిక ధర వెచ్చించడం కంటే ఇంట్లో ఉండే ఆహారాలతో మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.