Pregnancy Care: గర్భిణీలు వీటిని అసలు తినకూడదు.

చైనీస్ ఫుడ్ అంటే ముఖ్యంగా నూడిల్స్, మంచూరియా వంటివి గుర్తు వస్తాయి. ఇందులో అజినోమోటో ఉంటుంది కాబట్టి ఈ ఫుడ్ వల్ల మదర్, బేబీ ఇద్దరికి అనారోగ్యమే అంటున్నారు నిపుణులు. అందుకే వీటిని స్కిప్ చేయడం ఉత్తమం.

Written By: Swathi, Updated On : June 27, 2024 12:18 pm

Pregnancy Care

Follow us on

Pregnancy Care: గర్భిణీగా ఉన్నప్పుడు చాలా అనుమానాలు ఉంటాయి. ఈ సమయంలో కొన్ని ఆహారాలను తీసుకోకూడదు అని పెద్దలు చెబుతుంటే నిపుణులు మాత్రం ఎలాంటి సమస్యలు ఉండవు అంటారు. బొప్పాయి తినవద్దు అని పెద్దలు చెబుతారు. కానీ నిపుణులు మాత్రం ఎలాంటి సమస్యలు ఉండవు అంటారు. ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి. అయితే గర్భిణీ స్త్రీలు తినకూడని కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కాఫీ: కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. కానీ కాఫీ గ్యాస్ ను ఫామ్ చేస్తుందట. దీని వల్ల బేబీ గ్రోత్ కు ఆటంకం కలుగుతుంది. బ్లడ్ సప్లే కూడా తగ్గుతుంది. అందుకే వీలైనంత వరకు కాఫీని స్కిప్ చేయడం బెటర్. సాధారణ సమయాల్లో కూడా టీ, కాఫీలను ఎక్కువగా తీసుకోవద్దు అని చెబుతుంటారు నిపుణులు. అందుకే మీరు గర్భిణీలు అయితే కొన్ని రోజులు అయినా కాఫీని స్కిప్ చేయండి.

కూల్ డ్రింక్స్: కూల్ డ్రింక్స్ లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఈ సమయంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి కాబట్టి క్యాలరీలు ఎక్కువ ఉండే కూల్ డ్రింక్స్ ను తీసుకోవద్దు. వీటి వల్ల తల్లిబిడ్డకు ప్రమాదం అంటున్నారు నిపుణులు.

చైనీస్ ఫుడ్: చైనీస్ ఫుడ్ అంటే ముఖ్యంగా నూడిల్స్, మంచూరియా వంటివి గుర్తు వస్తాయి. ఇందులో అజినోమోటో ఉంటుంది కాబట్టి ఈ ఫుడ్ వల్ల మదర్, బేబీ ఇద్దరికి అనారోగ్యమే అంటున్నారు నిపుణులు. అందుకే వీటిని స్కిప్ చేయడం ఉత్తమం.

పచ్చి బొప్పాయి: పచ్చి బొప్పాయి వల్ల గర్భం పోయే సమస్య ఉంటుందట. పండు బొప్పాయి తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదట. కానీ పచ్చి బొప్పాయిని మాత్రం తినవద్దు అంటున్నారు నిపుణులు. ఈ ఫ్రూట్ ను కూడా మీరు స్కిప్ చేయాల్సిందే. దీన్ని నిపుణులు మాత్రమే కాదు ఇంట్లో పెద్ద వారు కూడా స్కిప్ చేయమని చెబుతుంటారు.

స్మోకింగ్, డ్రికింగ్: ఇది అబ్బాయిలకు కదా చెప్పాల్సింది అనుకుంటున్నారా. అన్నింటిలో మేము ఉంటాము అంటూ అమ్మాయిలు స్మోకింగ్, డ్రికింగ్ కూడా చేస్తున్నారు. కానీ మీరు గర్భిణీ స్త్రీలు అయితే మాత్రం వీటిని స్కిప్ చేయండి. ఈ అలవాటు వల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డకు చాలా ప్రమాదం. దీన్ని పూర్తిగా మానేయడం ఉత్తమం.