Sugar Control Tips: శీర్షిక చదవగానే ఏదో తేడాగా ఉందేంటి అనిపిస్తుందా.. మీరు చదివించి నిజమే.. సాధారణంగా వ్యాధలు దరిచేరకుండా ఉండేందుకు వేడి వేడిగా తినాలని డాక్టర్లు సూచిస్తారు. ఇక వర్షాకాలంలో నీరు కూడా కాచి చల్లార్చి గోరు వెచ్చగా తాగాలంటారు. ఇక ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న దీర్ఘ కాలిక వ్యాధుల్లో మధుమేహం ఒకటి. ఇది నియంత్రణలో ఉండాలంటే చల్లారాక తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
సాధారణంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటంతో అన్నాన్ని పూర్తిగా మానమని వైద్యులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చెబుతారు, కానీ ఇటీవలి పరిశోధనలు తయారీ, తినే పద్ధతులపై దృష్టి సారిస్తున్నాయి. అన్నం ప్రధానంగా స్టార్చ్‌తో నిండి ఉంటుంది, ఇది శరీరంలో త్వరగా గ్లూకోజ్‌గా మారుతుంది. వేడిగా తిన్నప్పుడు ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది, రక్తంలో చక్కెర స్థాయి ఆకస్మికంగా పెరుగుతుంది. కానీ అన్నాన్ని గది ఉష్ణోగ్రతలో లేదా రెఫ్రిజరేటర్లో కొన్ని గంటలు ఉంచితే, స్టార్చ్ భాగం రెసిస్టెంట్ రూపంలోకి మారుతుంది. ఇది జీర్ణం కావడానికి కష్టమవుతుంది, ఫలితంగా గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలవుతుంది. ఇలా చేయడం వల్ల మధుమేహులకు రక్త చక్కెర నియంత్రణ సులభమవుతుంది.
ఇటీవలి అధ్యయనాలు..
ఆహారం చల్లార్చడం వల్ల ప్రయోజనాలుపలు ప్రయోగాల్లో, అన్నాన్ని 12–24 గంటలు చల్లార్చి మళ్లీ ఆవిరి చేసి తిన్నవారిలో భోజనం తర్వాత రక్త గ్లూకోజ్ పెరుగుదల తక్కువగా ఉందని తేలింది. ఇది మధుమేహ టైప్ 1 ఉన్నవారిలో కూడా సానుకూల ఫలితాలు చూపింది. అంతేకాక, రెసిస్టెంట్ స్టార్చ్ పెరగడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది, శరీరంలో వాపు తగ్గుతుంది, ఇన్సులిన్ ప్రతిస్పందన మెరుగవుతుంది. ఇలాంటి మార్పులు సాధారణ బియ్యాన్ని ఆరోగ్యకరమైన ఎంపికగా మార్చుతాయి. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో భాగమైనప్పుడు. అయితే, ఈ ప్రయోజనాలు వ్యక్తి ఆరోగ్య స్థితి, బియ్యం రకం, చల్లార్చే కాలం మీద ఆధారపడి మారవచ్చు.
మిగిలిన అన్నంతో వంటలు..
రాత్రి మిగిలిన అన్నాన్ని పొద్దున్నే వేయించి తినడం సాధారణం, ఇది చల్లారిన దశలో రెసిస్టెంట్ స్టార్చ్ పెంచుతుంది. ఇలాంటి వంటల్లో గ్లూకోజ్ విడుదల నియంత్రణలో ఉంటుంది. కానీ వేయించేటప్పుడు అధిక నూనె లేదా కొవ్వు పదార్థాలు జోడిస్తే ఆరోగ్య ప్రయోజనాలు తగ్గిపోతాయి. బదులుగా, ఎక్కువ కూరగాయలు లేదా ప్రోటీన్ మూలాలు(గుడ్లు వంటివి) చేర్చితే ఫైబర్ పెరిగి, చక్కెర నియంత్రణ మరింత మెరుగవుతుంది. ఎల్లప్పుడూ రక్త చక్కెర స్థాయిలను పరీక్షించుకోవడం ముఖ్యం.
దంపుడు బియ్యం, మిల్లెట్ల పాత్రసాధారణ తెలుపు బియ్యం కంటే దంపుడు లేదా గోధుమ రంగు బియ్యం మంచిది. ఎందుకంటే అందులో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. ఇవి చల్లార్చినప్పుడు మరింత ఆరోగ్యకరమవుతాయి. మిల్లెట్లు లేదా ఇతర ధాన్యాలు కూడా తక్కువ చక్కెర విడుదల చేస్తాయి, కానీ అన్నం తినాలనుకునేవారికి చల్లార్చిన పద్ధతి ఒక మంచి మార్గం. మొత్తంగా, మధుమేహ నిర్వహణలో ఆహార పద్ధతులు వ్యక్తిగతంగా సర్దుబాటు చేసుకోవాలి, వైద్య సలహా తీసుకుని మాత్రమే అమలు చేయాలి.