Raisins డ్రైఫ్రూట్స్ అంటే మీలో ఎంత మందికి ఇష్టం. అందరికీ ఇష్టమే ఉండి ఉంటుంది. ఇక ఖరీదు ఎక్కువైనా సరే వీటి వల్ల ప్రయోజనాలు ఎక్కువే ఉంటాయి. కొన్ని నానబెట్టుకొని తినడం వల్ల ప్రయోజనాలు ఉంటే కొన్నింటిని అలాగే తింటారు. బాదం, కిస్మిస్, పిస్తా వంటివి డ్రై ఫ్రూట్స్ లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తాయి. ఇక ఇందులో కిస్మిస్ లను కూడా ఇష్టంగానే తింటారు. మరి వీటి వల్ల ఉన్న ప్రయోజనాలు తెలుసుకుంటే మరింత ఎక్కువ తినాలి అనే ఆలోచన వస్తుంది. ఇంతకీ వీటి వల్ల ప్రయోజనాలు ఏంటో ఓ సారి తెలుసుకోండి.
తియ్యగా, కాస్త పుల్లగా ఉండే కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. రుచి మాత్రమే కాదు ఈ కిస్మిస్ లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యాన్ని పెంపొందించే అనేక ఔషధ పోషక పదార్థాలు ఈ చిన్న చిన్న పండ్లలో ఉంటాయి. కిస్మిస్‌లలో పాలిఫినాలిక్ ఫైటో పోషకాలుంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. బాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటాయి.
పిల్లలకు ప్రతి రోజు ఉదయం ఈ ఎండుద్రాక్షలను ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వారి మెదడు డెవలాప్ మెంట్ బాగుంటుంది అంటున్నారు నిపుణులు. అలాగే ఇందులో చక్కెర, కేలరీలు, అధికంగా ఉంటాయి. అయితే ఎండు ద్రాక్ష అందరికీ మంచిది కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి. ఎండు ద్రాక్షను ఎవరు తినచ్చు.. ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
ఎండుద్రాక్షను ఎప్పుడైన తినవచ్చు. కానీ నానబెట్టిన ఎండుద్రాక్ష ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. నానబెట్టిన ద్రాక్షను తినడం వలన పోషక విలువ పెరుగుతుంది. ఎండుద్రాక్ష కంటే నానబెట్టిన ద్రాక్షలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే నార్మల్ ఎండు ద్రాక్ష కంటే నానబెట్టిన ద్రాక్ష నీటిని తాగడం వలన ఆరోగ్యానికి ప్రయోజనాలు ఎక్కువ. ఎందుకంటే.. ద్రాక్షలో ఉంటే పోషకాలన్ని ఆ నీటిలో కరిగిపోతాయి. అందుకే ఆ నీటిని తాగడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
అయితే, ఎండుద్రాక్షను బరువు తగ్గాలని అనుకునేవారు అసలు తినకూడదు. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఎండుద్రాక్షలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి దారితీస్తాయి.
ఎండుద్రాక్ష జీర్ణ సమస్యలకు మంచిది కానీ దీని వల్ల సమస్యలు కూడా ఉన్నాయి.అయితే అతిగా తిన్నప్పుడు మాత్రమే ఈ సమస్యలు వస్తాయి. కడుపుకు సంబంధించిన సమస్యలను పెంచుతుంది. గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరి మొదలైనవాటికి కారణం అవుతుంది. ఎక్కువ తింటే కడుపులో గందరగోళం చెలరేగుతుంది. చర్మ సమస్య వ్యాధులు ఉన్నవారు కిస్మిస్‌కి దూరంగా ఉండాలి. ఎండుద్రాక్ష ఎక్కువగా తింటే అలెర్జీ కలిగిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను ఇది దారుణంగా ప్రభావితం చేస్తుంది. దగ్గు, జలుబు రావడానికి కారణం అవుతుంది. అందుకే కొన్ని సార్లు ఈ ఎండు ద్రాక్షకు దూరంగా ఉండటమే బెటర్. అతి సర్వత్రా వర్జయేత్ అనే పదం ఈ ఎండు ద్రాక్షలో కూడా వర్తిస్తుంది. అందుకే మీరు ఎక్కువ తినేటప్పుడు కాస్త ఆలోచించండి. లిమిట్ గా తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు కాబట్టి జాగ్రత్త.