Water Bottles: రెస్టారెంట్ లలో కూల్ వాటర్ బాటిల్ కాకుండా నార్మల్ వాటర్ బాటిల్ కొంటున్నారా… ఎంత ప్రమాదమో తెలుసా…

Water Bottles: కొన్ని సందర్భాలలో బయటకు వెళ్ళినప్పుడు రెస్టారెంట్ కు కానీ హోటల్ కు కానీ వెళ్తారు.అలా వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ కొనాల్సి వస్తుంది.అయితే చాలా మంది కూల్ వాటర్ బాటిల్ ఆరోగ్యానికి మంచిది కాదని నార్మల్ వాటర్ బాటిల్ కొంటారు.

Written By: Chai Muchhata, Updated On : July 15, 2024 6:20 pm

Drinking water in plastic water bottles is a health risk

Follow us on

Water Bottles: ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు.అయితే మారుతున్నటెక్నాలజీ,ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మనిషి జీవనశైలి కూడా బాగా మారిపోయింది.మనిషి ఆహారం విషయంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.ఇప్పుడు చాలా మంది ఇంస్టెడ్ ఫుడ్,ప్రాస్టెడ్ ఫుడ్ అంటూ బయట ఆహారం తింటున్నారు.అలాంటి ధోరణిలో ఇప్పుడు కొంచెం మార్పు వచ్చిందని చెప్పచ్చు.ఆరోగ్యంగా ఉండడానికి డాక్టర్లు చెప్పే విషయాలను చాలా మంది ఫాలో అవుతున్నారు.తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు.అయితే కొంత మంది బయటకు వెళ్ళినప్పుడు కూల్ వాటర్ బాటిల్ లేదా నార్మల్ వాటర్ బాటిల్ కొంటారు.అయితే అలా నార్మల్ వాటర్ బాటిల్ లో ఉన్న నీళ్లు తాగడం కూడా ప్రమాదం అని చాలా మందికి తెలియదు…

కొన్ని సందర్భాలలో బయటకు వెళ్ళినప్పుడు రెస్టారెంట్ కు కానీ హోటల్ కు కానీ వెళ్తారు.అలా వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ కొనాల్సి వస్తుంది.అయితే చాలా మంది కూల్ వాటర్ బాటిల్ ఆరోగ్యానికి మంచిది కాదని నార్మల్ వాటర్ బాటిల్ కొంటారు.అయితే ఫ్రిడ్జ్ లో పెట్టిన కూల్ వాటర్ బాటిల్ కంటే నార్మల్ వాటర్ బాటిల్ వల్లనే చాలా ప్రమాదం అని మనలో చాలా మందికి తెలియదు.ఎందుకంటే హోటల్స్,షాప్స్,రెస్టారెంట్లలో వాటర్ బాటిల్స్ ను ప్రత్యేకంగా స్టోర్ చేయరు.వాటిని బయట ఎండలో కానీ లేదా ఒక గదిలో కానీ పెడతారు.అలా చేయడం వలనే అసలు సమస్య వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.వాటర్ బాటిల్స్ ను డైరెక్ట్ గా ఎండ తగిలే విధంగా పెడితే ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి.కొన్ని సార్లు కాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఎందుకంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లో ప్రమాదకరమైన బిపిఎ,ఫాథలెట్స్,పిఎఫ్ ఏ ఎస్ వంటి కెమికల్స్ ఉండడం వలన ఎండ వేడికి అవి నీళ్లలో కలిసే ప్రమాదం ఉంటుంది.దాని వల్ల కాన్సర్ వచ్చే అవకాశం ఉంది.ఎండలోని యూవీ కిరణాలూ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మీద పడటం వలన నీళ్లు కలుషితం అవుతాయి.ఈ క్రమంలో డియోక్సిన్స్,ఫ్యురన్స్,పీసీబీ వంటి ప్రమాదకరమైన కారకాలు ఏర్పడతాయి.వీటి వలన చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.ఇలా ఎండలో ఉంచిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నీళ్లు తాగితే కాన్సర్,హార్మోన్ సమస్యలు,ఇమ్యూనిటీ సమస్యలు,న్యూరలాజికల్ సమస్యలు,ప్రత్యుత్పత్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.అయితే చాలా రెస్టారెంట్లలో కానీ షాప్స్ లో కానీ మేము ఎండలో పెట్టడం లేదు, ఒక రూమ్ లో స్టోర్ చేస్తున్నాం అంటారు.

కానీ అలా ఎక్కువ రోజులు ప్లాస్టిక్ బాటిల్స్ లో స్టోర్ చేసిన నీళ్లు కూడా ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని చాలా మందికి తెలియదు.ఎక్కువ రోజులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నీళ్లను ఉంచితే వాటిలో మైక్రో ప్లాస్టిక్ కలుస్తుంది.దాని వలన మనిషి శరీరానికి చాలా హాని కలుగుతుంది.ఎక్కువ రోజులు ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు నిల్వ ఉంచితే వాటిలో బ్యాక్టీరియా,ఫంగస్ ఏర్పడతాయి.ఈ నీళ్లు తాగడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి.ముఖ్యంగా ఈ నీళ్లు తాగడం వలన హార్మోన్ పరమైన సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు.కాన్సర్ వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువ గా ఉంటుంది.అయితే ఎండలో పెట్టిన అలాగే ఎక్కువ రోజులు ప్లాస్టిక్ బాటిల్ లో నిల్వ ఉంచిన నీళ్లు తాగిన కూడా చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.అయితే కూల్ వాటర్ అయినా నార్మల్ వాటర్ అయినా కూడా అది ప్లాటిక్ బాటిల్ లో వాటర్ తాగితే మనిషి ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని నిపుణులు చెప్తున్నారు.అలా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లో నీళ్లు తాగి మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా రిస్క్ లో పెట్టుకుంటున్నట్లే అవుతుంది.