https://oktelugu.com/

కాఫీ ఎక్కువగా తాగడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఇవే..?

మనలో చాలామంది కాఫీ తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కాఫీ తాగడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఎక్కువగా కాఫీ తాగడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. కాఫీ మెదడును ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల మెమొరీ లాస్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. కాఫీలో కెఫిన్ అనే మూలకం ఉంటుందనే సంగతి తెలిసిందే. కెఫిన్ మెదడు నాడీ వ్యవస్థపై […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 27, 2021 / 02:52 PM IST
    Follow us on

    మనలో చాలామంది కాఫీ తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కాఫీ తాగడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఎక్కువగా కాఫీ తాగడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. కాఫీ మెదడును ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల మెమొరీ లాస్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది.

    కాఫీలో కెఫిన్ అనే మూలకం ఉంటుందనే సంగతి తెలిసిందే. కెఫిన్ మెదడు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉండగా శరీరంలో కెఫిన్ ప్రభావం పెరిగితే మెదడుపై చెడు ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం కాఫీ తాగిన సమయంలో కాఫీలో ఉండే కెఫిన్ రక్తంలో కలుస్తుంది. ఒకరోజులో 300 నుంచి 400 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ ను తీసుకోకూడదని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

    శరీరంలోకి కెఫిన్ చేరితే ఒక వ్యక్తి శారీరకంగా లేదా మానసికంగా శక్తిని పొందే అవకాశం అయితే ఉంటుంది. రోజులో ఒకటి లేదా రెండు చిన్న కప్పుల కాఫీ తీసుకుంటే మంచిది. అంతకు మించి కాఫీ తీసుకుంటే శరీరానికి లాభం కంటే నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కెఫిన్ శరీరంలోకి అధికంగా చేరితే హాని జరుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కెఫిన్ వల్ల ఆకలి తగ్గి బరువు తగ్గడంతో పాటు నిద్ర సమస్యలు వస్తాయి.

    కెఫిన్ శరీరంలో పెరిగితే ఎక్కువ మూత్రం విడుదల కావడం వల్ల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. కెఫిన్ రకపోటుపై కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. హై బీపీ హృదయాన్ని ప్రభావితం చేయడంతో పాటు ఇతర సమస్యలకు కారణమవుతుంది. కాఫీ ఎక్కువగా తాగేవాళ్లు తమ అలవాట్లను మార్చుకుంటే మంచిది.