ఈ వీకెండ్ 5 సినిమాలు.. ప్రేక్షకుల పరిస్థితేంటి ?

కరోనా సెకండ్ వేవ్ ముగింపు దశలో ఉండటంతో ఇప్పుడు తెలంగాణలో థియేటర్లు అన్ని తెరుచుకోవడానికి ముస్తాబు అయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా మల్టీప్లెక్స్ లు, కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు స్టార్ట్ కాబోతున్నాయి. దాంతో, ఈ వీక్ సినిమాల రాక మొదలైంది. ఏకంగా ఈ వీకెండ్ 5 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ ఐదు సినిమాల విషయానికి వస్తే.. సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’ ఒకటి కాగా, యంగ్ హీరో తేజ సజ్జ నటించిన ‘ఇష్క్’ సినిమా […]

Written By: admin, Updated On : July 27, 2021 2:59 pm
Follow us on

కరోనా సెకండ్ వేవ్ ముగింపు దశలో ఉండటంతో ఇప్పుడు తెలంగాణలో థియేటర్లు అన్ని తెరుచుకోవడానికి ముస్తాబు అయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా మల్టీప్లెక్స్ లు, కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు స్టార్ట్ కాబోతున్నాయి. దాంతో, ఈ వీక్ సినిమాల రాక మొదలైంది. ఏకంగా ఈ వీకెండ్ 5 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

ఆ ఐదు సినిమాల విషయానికి వస్తే.. సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’ ఒకటి కాగా, యంగ్ హీరో తేజ సజ్జ నటించిన ‘ఇష్క్’ సినిమా మరొకటి. ఈ రెండు సినిమాలు ఈ నెల 30న రిలీజ్ కి సన్నద్ధం అయ్యాయి. అలాగే ఈ చిత్రాలతో పాటు మరో మూడు చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.

ఆ సినిమాల విషయానికి వస్తే.. ‘త్రయం’, ‘నరసింహపురం’, ‘పరిగెత్తు పరిగెత్తు’ అనే మూడు చిన్న చిత్రాలు కూడా జులై 30నే థియేటర్ లోకి రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ మేరకు ఈ సినిమాలు పోస్టర్స్ ను కూడా రిలీజ్ చేశాయి. అయితే, అడ్రస్ లేని ఈ సినిమాలకు ఓపెనింగ్స్ ఎంతవరకు వస్తాయి అన్నదే ఇక్కడ డౌట్.

దీనికితోడు ఈ సినిమాల హీరోలు, దర్శకులెవ్వరూ అనేది ఎవరికీ తెలియదు. ఈ లెక్కన ఈ సినిమాలకు పోస్టర్స్ ఖర్చుల డబ్బులు అయినా వస్తాయా అన్నదే ఇక్కడి ప్రశ్న. ఇక ఈ మూడు చిన్న సినిమాల విషయాన్ని పక్కన పెడితే.. ‘తిమ్మరుసు’, ‘ఇష్క్’ సినిమాలకు కాస్త ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే సినిమాలకు ప్రేక్షకులు వస్తారా ? రారా ? అనేది ఈ వీకెండ్ తేలిపోతుంది.