https://oktelugu.com/

Drinking bottled water : బాటిల్స్ లో నీరు తాగుతున్నారా? టాయిలెట్స్ లో కంటే ప్రమాదకరమైన బాక్టీరియా ఉంటుందని మీకు తెలుసా?

ప్రతి రోజు స్కూల్, కాలేజీ, ఆఫీస్ లకు వెళ్తే నీరు (water) తాగాలంటే కచ్చితంగా బాటిల్ ఉండాల్సిందే. ఈ బాటిల్ ను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తుంటారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 8, 2025 / 01:00 AM IST

    Drinking bottled water

    Follow us on

    Drinking bottled water : ప్రతి రోజు స్కూల్, కాలేజీ, ఆఫీస్ లకు వెళ్తే నీరు (water) తాగాలంటే కచ్చితంగా బాటిల్ ఉండాల్సిందే. ఈ బాటిల్ ను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తుంటారు. బాటిల్ ఉపయోగిస్తూ రోజులు రోజులు గడుపుతారు కానీ కొందరు దాన్ని వాష్ కూడా చేయరు. ఇక మీరు ఉపయోగించే ఈ వాటర్ బాటిల్స్ (bottle) గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు తాగే వాటర్ బాటిల్ గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం. అయితే సగటు పునర్వినియోగ నీటి బాటిల్‌లో 20.8 మిలియన్ కాలనీ-ఫార్మింగ్ యూనిట్లు (CFUలు) బ్యాక్టీరియా ఉండవచ్చని ఓ అధ్యయనం తెలిపింది.

    ఇక సీసాలో స్పౌట్-టాప్ లేదా స్క్రూ-టాప్ మూత ఉంటే మాత్రం ఈ సంఖ్య 30 మిలియన్లకు చేరుకుంటుంది. అయితే చాలా మంది టాయిలెట్స్ లోనే బాక్టీరియా ఎక్కువ ఉంటుంది అనుకుంటారు కదా. కానీ ఈ బాటిల్స్ లో టాయిలెట్ సీటుపై ఉండే బ్యాక్టీరియా కంటే ఎక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు.

    కడుపు నొప్పి పెరగవచ్చు ..
    రీసెంట్ గా చేసిన అధ్యయనంలో ఈ వాటర్ బాటిల్స్ లో రెండు రకాల బాక్టీరియాలను ఉంటాయి అని తేలింది. గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియా, సిల్లస్ అనే రెండు బాక్టీరియాలు ఉంటాయట. ఈ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్, తీవ్రమైన కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అయితే పునర్వినియోగించే ఈ వాటర్ బాటిల్స్ లో బ్యాక్టీరియా ఎలా వ్యాపిస్తుంది అనే అనుమానం మీకు రావచ్చు.

    వాటర్‌ ఫిల్టర్‌గురు.కామ్ అనే అమెరికన్ ఫిల్ట్రేషన్ కంపెనీ నిర్వహించిన అధ్యయనంలో బాటిళ్ల ఉష్ణోగ్రత, శుభ్రత లోపించడం వల్ల పునర్వినియోగ నీటి బాటిళ్లపై బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని వెల్లడైంది. బాటిల్‌ను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినట్లయితే, బ్యాక్టీరియా వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. అయితే లీసెస్టర్ విశ్వవిద్యాలయంలో క్లినికల్ మైక్రోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రింరోస్ ఫ్రీస్టోన్ మాట్లాడుతూ బాటిళ్లను సరిగ్గా, క్రమం తప్పకుండా కడగడం వల్ల వాటిలో బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించవచ్చు అన్నారు.

    60 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద చాలా వరకు వ్యాధికారక క్రిములను చంపే వేడి నీటితో బాటిల్ కడగాలని నిపుణులు అంటున్నారు. అలాగే, బాటిల్‌ను కడగడానికి డిష్‌వాషింగ్ లిక్విడ్‌ని ఉపయోగించాలి. దానిని పది నిమిషాల పాటు అటూ ఇటూ తిప్పి కాస్త ఎక్కువ సేపు క్లీన్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి ఆరబెట్టాలి. బాటిల్ చాలా మురికిగా ఉంటే, సగం వెనిగర్, సగం నీరు మిశ్రమాన్ని వేసి కొన్ని రోజులు నానబెట్టి, ఆపై గోరువెచ్చని నీటితో కడిగి ఆరబెట్టండి.