Pregnancy : గర్బం దాల్చడం ప్రతి మహిళకు చాలా అవసరం. తల్లి అవడం వల్ల మహిళ జన్మ స్వార్థకం అవుతుందని నమ్ముతుంటారు. ఇక గర్బం దాల్చిన తర్వాత చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. ప్రస్తుతం గర్బం దాల్చడం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. ఇక గర్బం దాల్చిన తర్వాత ఎన్నో సమస్యలు కూడా వస్తాయి. అందులో ముఖ్యంగా రక్తం గడ్డకట్టడం. అయితే ఈ సమస్య ఓ నటికి వచ్చిందట. ఇంతకీ ఏం జరిగిందంటే?
‘సూపర్ ఉమెన్’ 39 సంవత్సరాల హాలీవుడ్ నటి గాల్ గాడోట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది. ఇక ఈమె ప్రస్తుతం నాల్గవ గర్బం సమయంలోని ఓ సంఘటనను తన అభిమానులతో పంచుకుంది. అయితే ఈమెకు తన నాల్గవ గర్భధారణ సమయంలో మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలిపింది. కొన్ని వారాలపాటు నొప్పితో బాధపడిన తర్వాత, MRI స్కాన్‌లో గాడోట్‌కు “సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ (CVST)” ఉన్నట్లు వెల్లడైంది. ఇది మెదడు బయటి సిరల్లో ఏర్పడే అరుదైన రక్తం గడ్డకట్టడం వల్ల సంభవిస్తుందట.
దీని తరువాత గాడోట్ అత్యవసర శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరింది. అదే సమయంలో కొన్ని గంటల తర్వాత తన నాల్గవ కుమార్తె ఓరీకి జన్మనిచ్చింది. అయితే తను పడిన బాధ మరెవరు పడకూడదు అని ఈ విషయం పట్ల అవగాహన పెంచడానికి తన వంతు కృషి చేస్తుంది. అయితే ఈ రక్తం గడ్డకట్టే సంకేతాలను విస్మరించవద్దని గాడోట్ తన 108 మిలియన్ అనుచరులకు విజ్ఞప్తి చేసింది. ఇక CVST అనేది ఒక రకమైన స్ట్రోక్. దీనిలో మెదడు బాహ్య రక్త నాళాలలో గడ్డకడుతుంది. దీనివల్ల మెదడుకు రక్తం చేరదు. అంతేకాదు ఇది ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. CVST అనేది గర్భిణీ స్త్రీలలో ఒక సాధారణ పరిస్థితి. ఎందుకంటే గర్భధారణ సమయంలో రక్తం చిక్కగా ఉంటుంది. ఈ సమయంలో BP కూడా పెరుగుతుంది.
గర్భధారణ సమయంలో, స్త్రీ శరీరంలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ కారణంగా, గర్భిణీ స్త్రీలు రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, ప్రీఎక్లాంప్సియా (గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు) కూడా రక్తం గడ్డకట్టడానికి ఒక ముఖ్యమైన కారణం కావచ్చు. ఇక CVSTకి మందులతో చికిత్స చేయవచ్చు. అయితే తీవ్రమైన కేసులకు గాడోట్ కేసు వంటి శస్త్రచికిత్స (థ్రోంబెక్టమీ) అవసరమవుతుంది. ఈ శస్త్రచికిత్సలో, మూసుకుపోయిన రక్తనాళాలను తెరవడం ద్వారా గడ్డకట్టడం వంటి సమస్యను నయం చేసుకోవచ్చు. కొన్నిసార్లు స్టెంట్ కూడా చేస్తారు. తద్వారా రక్తం సాధారణంగా ప్రవహిస్తుంది.
గర్భధారణ సమయంలో మెదడులో రక్తం గడ్డకట్టడం వంటి లక్షణాలను ముందుగా తెలుసుకోవచ్చు. తలనొప్పి ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా పడుకున్నప్పుడు తీవ్రంగా, అకస్మాత్తుగా వస్తుంది. ఇక అస్పష్టమైన దృష్టి, మూర్ఛ, శరీరంలోని ఏదైనా భాగంలో కదలిక కోల్పోవడం వంటి సమస్య వస్తుంది. వణుకు కూడా వస్తుంది. స్పష్టంగా మాట్లాడలేకపోవడం, ముఖం, శరీరం చుట్టూ తిమ్మిరి వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటి సమస్యలు గర్భధారణ సమయంలో ఉంటే కచ్చితంగా ముందు జాగ్రత్త తీసుకోవాలి.