Health Tips : ఆరోగ్యం ఉండటం అంటే ప్రస్తుతం పెద్ద సవాలే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. కానీ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా చాలా మంది డబ్బు వెనక పరుగెడుతున్నారు. ఇక ఒకప్పుడు చాలా మంది వంద సంవత్సరాలకు మించి జీవించేవారు. కానీ ప్రస్తుతం ఎక్కువ సంవత్సరాలు బతకడం కూడా లేదు. 60 సంవత్సరాలు బతికితే చాలు అనుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండటం కూడా చాలా కష్టమే. ఎన్నో విధాలుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. హాస్పిటల్ ఖర్చుల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కూడబెట్టిన డబ్బు మొత్తం హాస్పిటల్స్ కు పెట్టేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
ఇక విదేశీయులు దీర్ఘాయువు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ మీరు అన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ 7 పనులను ఉచితంగా చేస్తే చాలు. విదేశాల్లోని ప్రజలు 150 ఏళ్లు జీవించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ మీరు మాత్రం ఉచితంగా ఆరోగ్యకరమైన, దీర్ఘకాల జీవితాన్ని పొందవచ్చు. మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని 6 విషయాలు ఇప్పుడు మేము చెప్పబోతున్నాము.
శ్వాస
శరీరానికి ఆక్సిజన్ ఎంత ఎక్కువగా చేరితే అంత ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగుతున్న వయస్సుతో, ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతాయి. కాబట్టి లోతైన శ్వాస తీసుకోవడం ద్వారా వాటి సామర్థ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇక వీటి పరిమాణం తగ్గుతుంటుంది. అందుకే వీటి పరిమాణాన్ని పదిలం చేసుకోవాలి. మీరు ఉచితంగా శ్వాస వ్యాయామాలు చేయవచ్చు. లోతైన శ్వాస కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎలంటి వ్యాధులు అయినా సరే శరీరం లోపల ఉండవు.
ఆహారం
మీరు మీ ఆహారంలో ఖరీదైన ఆరోగ్యకరమైన పదార్థాలను కొనుగోలు చేయలేకపోతే, హానికరమైన వాటిని తినడం మాత్రం కచ్చితంగా ఆపేయాలి. ఇది కూడా మీ జేబు నుంచి ఏమీ ఖర్చు చేయదు కదా. ఈ అలవాటు మీ పొదుపును పెంచుతుంది. ఇంట్లో వండిన మంచి ఆహారాన్ని మాత్రమే తినాలి. బయట బిర్యానీలు, ఫ్రైడ్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్ ను తినడం మానుకోవాలి. వీటి వల్ల సమస్యలు పెరుగుతాయి.
చురుకుగా ఉండండి
జపాన్‌లోని ప్రజలు తమను తాము పదవీ విరమణ చేసినట్లు ఎప్పుడూ భావించరు. 80-90 సంవత్సరాల వయస్సు గల వారు కూడా అక్కడ ఏదో ఒక పని చేస్తూ కనిపిస్తారు. తమను తాము వృద్ధులుగా భావించే వారి శరీరం రోగాల బారిన పడటం ప్రారంభిస్తుందని నమ్ముతారు.
టెన్షన్: చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. సమస్య చాలా చిన్నది అయినా సరే టెన్షన్ మాత్రం ఎక్కువ పడతారు. ప్రపంచంలో వారికి మాత్రమే కష్టాలు ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. కానీ ఈ అలవాటు మానుకుంటే మీ ఆయుష్షు పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.
ఇప్పుడు పైన చెప్పిన ప్రతి దానికి కూడా ఒక రూపాయి ఖర్చు అవసరం లేదు. సో పైసా ఖర్చు లేకుండా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణుల. సో జాగ్రత్త.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..