https://oktelugu.com/

#PKSDT : #PKSDT సినిమా ఇప్పట్లో లేనట్టే..ఫ్యాన్స్ ని నిరాశపరుస్తున్న లేటెస్ట్ అప్డేట్

'ఉస్తాద్ భగత్ సింగ్' మరియు #OG మూవీ కి సంబంధించిన అప్డేట్స్ వరద లాగ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్  ఫ్యాన్స్ అందుకే #PKSDT మేకర్స్ పై పీకలదాకా కోపం తో ఉన్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : May 14, 2023 / 07:07 PM IST
    Follow us on

    #PKSDT : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉన్న సినిమా #PKSDT . రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది.ఒక పాట మరియు ఒక ఫైట్ మాత్రమే బ్యాలన్స్ ఉందట. జులై 28 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నట్టు ఇది వరకే అధికారిక ప్రకటన కూడా చేసారు మేకర్స్.

    సినిమా విడుదలకు సరిగ్గా రెండు నెలల సమయం ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ని అధికారికంగా ప్రకటించలేదు. ఇది ఫ్యాన్స్ కి చాలా చిరాకు కలిగిస్తున్న విషయం. సోషల్ మీడియా ద్వారా #BRO అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ మూవీ టీం నుండి ఇంకా క్లారిటీ రాలేదు. దీనితో ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ని ట్యాగ్ చేసి ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు.

    వాస్తవానికి ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు టీజర్ వీడియో ని ఈ నెల 12 వ తేదీన విడుదల చెయ్యాలనుకున్నారట.కానీ అదే సమయం లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని విడుదల చెయ్యబోతున్నాము అని ప్రకటన రావడం తో  #PKSDT మేకర్స్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ సినిమా టైటిల్ మరియు టీజర్ వీడియో ని ఇప్పట్లో విడుదల చేసే ఆలోచనే లేదట.

    ఈ నెల వదిలేసి వచ్చే నెల మొదటి వారం లో ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. విడుదల తేదీ ఖారారు అయినా సినిమాకి ఇప్పటి  వరకు ఎలాంటి అప్డేట్ లేదు, ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు #OG మూవీ కి సంబంధించిన అప్డేట్స్ వరద లాగ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్  ఫ్యాన్స్ అందుకే #PKSDT మేకర్స్ పై పీకలదాకా కోపం తో ఉన్నారు.