Body Smell: మీ శరీరం నుంచి దుర్వాసన వస్తుందా?

మసాలాలు ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు. దీని వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుందట. ముఖ్యంగా లవంగాలు, ఇలాచీ, పసుపు, మెంతులు వంటి మాసాలాలు నోటి నుంచి వచ్చే దుర్వాసనకు కారణం అవుతాయట.

Written By: Swathi, Updated On : July 2, 2024 5:17 pm

Body Smell

Follow us on

Body Smell: చాలా మందికి శరీరం దుర్వాసన వస్తుంటుంది. ఈ దుర్వాసన వల్ల నలుగురిలోకి వెళ్లాలి అంటే కూడా ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల ఖరీదైన పర్ఫూమ్ లు వాడుతుంటారు. అయినా కూడా వారికి ఏదో తెలియని ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధ పడుతున్నారా? ఇంతకీ ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఎలాంటి ఆహారం వల్ల వస్తుందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

మసాలాలు ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు. దీని వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుందట. ముఖ్యంగా లవంగాలు, ఇలాచీ, పసుపు, మెంతులు వంటి మాసాలాలు నోటి నుంచి వచ్చే దుర్వాసనకు కారణం అవుతాయట. వెల్లుల్లి, ఉల్లిపాయలు నాలుక, దవడకు అతుక్కుపోయి నోటి నుంచి దుర్వాసన వచ్చేలా చేస్తాయట. దీని వల్ల శరీరంలో ఉష్ణోగ్రత కూడా పెరిగిపోతుంది. అందుకే శరీరం నుంచి చెమట బయటకు వెళ్తుంది. చమట వస్తూ దుర్వాసన కూడా వస్తుంది.

మాంసం ఎక్కువగా తీసుకుంటే నోటి నుంచి మాత్రమే కాదు శరీరం నుంచి కూడా దుర్వాసన వస్తుందట. క్యాబేజీ గోబీ వల్ల కూడా ఈ సమస్య పెరుగుతుంది. ఇవి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి. ఇవి చమట, శ్వాస ద్వారా బయటకు వచ్చినప్పుడు స్మెల్ వస్తుంది.

పరిష్కారం ఇదిగో.. స్నానం చేస్తున్నప్పుడు టమాట రసాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా తగ్గుతుంది. వంట సోడ కూడా చెమట వాసనను తగ్గిస్తుంది. ఓ కప్పు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలపండి. దీన్ని అండర్ ఆర్మ్స్ లో స్ప్రే చేస్తే సరిపోతుంది. విపరీతమైన చెమట స్మెల్ తో మీరు బాధ పడుతుంటే కాస్త యాపిల్ సైడర్ వెనిగర్ ను కాటన్ తో ముంచి శరీరానికి రాసుకున్న మంచి ఫలితం ఉంటుంది.