https://oktelugu.com/

Reserve Bank: రూ. 10, రూ. 20 నాణేలు చెల్లవా..? రిజర్వ్ బ్యాంకు ఏం చెప్పిందంటే?

గతంలో మన ప్రధాని 2016లో పెద్ద నోట్ల రద్దును ప్రకటించారు. దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి పక్కన పెడితే.. ఆ సమయంలో నిర్ణీత గడువు ఇచ్చాడు పీఎం.

Written By:
  • Neelambaram
  • , Updated On : July 2, 2024 / 05:14 PM IST

    Reserve Bank

    Follow us on

    Reserve Bank: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం 5వ స్థానంలో కొనసాగుతోంది. అంటే ఆర్థికంగా వేగంగా ఎదుగుతోంది. మనలను పాలించిన బ్రిటీష్ దేశాన్ని కూడా మనం ఎప్పుడో వెనక్కు నెట్టేశాం. అన్ని వనరులు ఉన్న దేశంలో డబ్బు పుట్టించడం చిటికెలో పనే. కానీ అవినీతి నాయకులు, అధికారుల మూలంగా కోట్లాది రూపాయలు అవినీతి రూపంలో వారి వద్ద మురుగుతోంది. దీంతో ఇన్నేళ్లు వెనుకబడింది.

    అయితే, గతంలో మన ప్రధాని 2016లో పెద్ద నోట్ల రద్దును ప్రకటించారు. దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి పక్కన పెడితే.. ఆ సమయంలో నిర్ణీత గడువు ఇచ్చాడు పీఎం. ఆ లోపు పెద్ద నోట్లు సమీప బ్యాంకుల వద్ద మార్చుకోకుంటే చిత్తు కాగితాలుగా మిగిలిపోతాయని హెచ్చరించారు. గడువు సమీపిస్తున్న సమయంలో ఇంకొన్ని రోజులు కూడా పొడిగించారు. ఇక ఇటీవల మార్కెట్ లో రూ. 2000 నోట్లను బ్యాన్ చేశారంటూ వార్తలు వచ్చాయి. కానీ ‘బ్యాన్ చేయలేదు.. తిరిగి రి కలెక్ట్ చేస్తున్నాం.. మళ్లీ మార్కెట్లోకి రూ. 2000 రావు’ అంటూ ఆర్బీఐ చెప్పింది.

    ఇదంతా పక్కన పెడితే మనం కష్టపడి సంపాదించిన ప్రతీ రూపాయికి ప్రభుత్వం నుంచి ఆర్బీఐ వరకు విలువ ఇవ్వాల్సిందే. నిన్న రూపాయి ఇచ్చి నేటి నుంచి అది చెల్లదు అనే హక్కు ఎవరికీ లేదు. నోట్లు చిరిగాయని, నాణేలు సొట్ట పడ్డాయని రిజక్ట్ చేస్తే శిక్షార్హులు అవుతారని ఆర్బీఐ హెచ్చరిస్తోంది. అయితే ఈ బ్యాన్ ఇప్పుడు రూ. 10, రూ. 20 నాణేలపై పడింది.

    రూ. 10, రూ. 20 నాణేలు చెల్లుతాయా!
    ఇటీవల ఏ దుకాణం వెళ్లినా రూ. 10, రూ. 20 నాణేలను తీసుకోవడం లేదు. అయితే ఆర్బీఐ వీటిని బ్యాన్ చేసిందని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఇప్పటి వరకు కాయిన్స్ ను బ్యాన్ చేయలేదని. రూ. 10, రూ. 20 నాణేలు తీసుకోకుంటే కంప్లయింట్ చేయాలని ఆర్బీఐ చెప్పింది.

    ఒక కాయిన్, నోటును కానీ రద్దు చేయాలనుకుంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి అంత ఈజీగా జరగదు. ఎవరైనా ఈ నాణేలను రిజక్ట్ చేస్తే ఐపీసీ సెక్షన్ 124 ప్రకారం వారిపై ఫిర్యాదు చేస్తే మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని ఆర్బీఐ గైడ్ లైన్స్ చెప్తున్నాయి. రూ. 10, రూ. 20 నాణేలు భారత ప్రభుత్వం ధృవీకరణించినవి కాబట్టి వాటిని తిరస్కరించే హక్కు ఎవరికీ లేదని ఆర్బీఐ స్పష్టం చేస్తుంది.