Soft Drinks Effects on Brain: ప్రస్తుత కాలంలో శరీరం చల్లగా ఉండాలని కొందరు.. సరదా కోసం మరికొందరు కూల్ డ్రింక్స్ తాగడం ఎక్కువగా అలవాటు చేసుకుంటున్నారు. కూల్ డ్రింక్ తాగడం వల్ల తాత్కాలికంగా మనసు ఉల్లాసంగా మారుతుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. కానీ దీని మోతాదు ఎక్కువ అయితే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరిలోనూ రకరకాల సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్రెయిన్ సైజు తగ్గిపోతుందని కొన్ని నివేదికలు బయటపడుతున్నాయి. 2017 సంవత్సరంలో ప్రేమింగ్ హామ్ హార్ట్ స్టడీ నివేదిక ప్రకారం చక్కెర పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్రీ క్లినికల్ అల్జీమర్ వ్యాధి వస్తుందని పేర్కొంది. మరి చిన్నపిల్లల్లో, కొత్త దంపతుల్లో ఎలాంటి సమస్యలు తీసుకొస్తుందో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుత కాలంలో మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు జాగ్రత్తగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చక్కెర ఎక్కువగా కలిగిన పానీయాలను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఉత్తర అమెరికాలోని రిస్క్ అధ్యయనం ప్రకారం కొత్తగా పెళ్లయిన వారు ఎక్కువగా కూల్ డ్రింక్స్ తీసుకుంటే సంతాన సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర అమెరికాలోని Pregnancy Study Online (PRESTO) 3,828 మహిళలు, 1,045 పురుషులపై అధ్యయనం చేశారు. వీరిలో కెఫిన్, శీతల పానీయాలు అలవాట్లు కనుగొన్నారు. మహిళలు ప్రతిరోజు కూల్ డ్రింక్ తాగిన వారిలో సంతాన సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే మగవారు టిఫిన్ తో కూడిన టీ లేదా కాఫీ ఇతర చక్కెర పానీయాలు ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఈ సమస్యను గుర్తించారు. అలాగే సోడా లేదా ఎనర్జీ డ్రింక్ తాగిన వారిలో మాత్రం ఈ సమస్యను తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంటే చక్కెర అధికంగా తీసుకుంటే సంతాన సమస్య ఉండే అవకాశం ఉందని వైద్యులు గుర్తించారు.
అలాగే చిన్నపిల్లలు కూడా ప్రతిరోజు కూల్ డ్రింక్ తాగడం వల్ల మానసిక సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. వీరు అప్పుడప్పుడు తాగినా కూడా వారి మెదడుపై ప్రభావం పడి చదువుపై దృష్టి పెట్టలేక పోతుంటారు. అలాగే ఏకాగ్రత లేకపోవడం వల్ల ఏ విషయంపై మనసు ఉంచ లేకుండా ఉంటారు. అందువల్ల వారానికి ఒకసారి కూడా కూల్ డ్రింక్స్ తాగించే ప్రయత్నం చేయొద్దని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఇటీవల చాలా పదార్థాల్లో చక్కర అధికంగా ఉంటుంది. వీటితోపాటు కూల్ డ్రింక్స్ ను కూడా ఇవ్వడం వల్ల అదనపు చక్కర శరీరానికి చేరి వారి బరువుకు కారణమవుతుంది.
ఇక వృద్ధుల్లోనూ శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటే అల్జీమర్స్ సమస్య వచ్చే అవకాశం ఉందని రైతులు తెలుపుతున్నారు. పూర్వకాలపు వారి కంటే నేటి కాలపు వారిలో ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగే వారిలో ఇతరులతో కమ్యూనికేషన్స్ కూడా కోల్పోతున్నారని అంటున్నారు.