SSMB29 Update : ఒక సక్సెస్ ఫుల్ సినిమా తీయాలి అంటే దర్శకుడికి గట్స్ ఉండాలి. అంతకు మించిన ఓపిక ఉండాలి. దేనినైనా సాధించగలమనే పట్టుదల ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే ఒక దర్శకుడు గొప్ప సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలుగుతాడు…ఒక సినిమాని వంద మంది చూస్తున్నారు అంటే అందులో వంద మంది వంద రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళలో కనీసం 90 మంది నైనా సరే సాటిస్ఫైవ్ చేయగలిగితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తోంది… కానీ దర్శక ధీరుడైన రాజమౌళి చేసే సినిమాలు మాత్రం 100కి 100 మందికి నచ్చుతాయి. అలాంటి గొప్ప దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియాకి పరిచయం చేసిన ఆయన ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు…
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు షెడ్యూల్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన రాజమౌళి ఇప్పుడు నాలుగో షెడ్యూల్ కోసం సన్నాహాలు చేస్తున్నాడు. ఈ షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాలను సైతం చిత్రీకరించే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ఇక మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి ‘ ఎస్ఎస్ఎంబి 29′ అంటూ వర్కింగ్ టైటిల్ ను పెట్టుకున్నారు.
మరి ఈ సినిమా ఒరిజినల్ టైటిల్ ఏంటి అనే ధోరణిలో కొద్దిరోజుల నుంచి కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి…’వారణాసి’ అనే టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నారు అంటూ గత కొన్ని రోజుల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మూడు అక్షరాలతో కూడిన టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ మూడు అక్షరాలతో కూడిన టైటిల్ ప్రపంచవ్యాప్తంగా అందరికి కనెక్ట్ అయ్యేలా ఉండాలి. కాబట్టి దాని కోసం డేరింగ్ అనే టైటిల్ ను రాజమౌళి ఫిక్స్ చేశాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ ఇది ఫైనల్ కాదు ఇంకా ఏదో ఉంది. అది మూడు అక్షరాలతోనే ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి…
మొత్తానికైతే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని వారం రోజుల్లో రివీల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇక నవంబర్ నెల నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ని ఇస్తానని చెప్పిన రాజమౌళి ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ని ప్రకటించడానికి సిద్ధమవుతున్నాడు. మూడు అక్షరాలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ని కలిగి ఉన్న టైటిల్ ఏంటి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది…