https://oktelugu.com/

Manchu Vishnu: మంచు విష్ణు సినిమాకి పెరుగుతున్న ఆదరణ… కారణం ఏంటంటే..?

Manchu Vishnu: విష్ణు కంటిన్యూస్ గా సినిమాలు చేసుకుంటూ వస్తుంటే మనోజ్(Manoj) మాత్రం కొద్దిరోజుల నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 4, 2024 / 05:41 PM IST

    Manchu Vishnu movie is growing in popularity

    Follow us on

    Manchu Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు మోహన్ బాబు(Mohan Babu)…డిఫరెంట్ పాత్రలను చేయడమే కాకుండా తన మేనరిజమ్స్ తో ఎవరు చేయలేని పాత్రలను సైతం చేసి మెప్పిస్తు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇక ఇలాంటి మోహన్ బాబు కుటుంబం నుంచి తన కొడుకులు ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు.

    అయితే అందులో విష్ణు కంటిన్యూస్ గా సినిమాలు చేసుకుంటూ వస్తుంటే మనోజ్(Manoj) మాత్రం కొద్దిరోజుల నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే విష్ణు కన్నప్ప సినిమాలో చాలామంది పాన్ ఇండియన్ స్టార్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఇక దాంతో ఇప్పుడు కన్నప్ప సినిమా గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తీవ్రమైన చర్చలైతే జరుగుతున్నాయి. ఇక 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈజీగా 300 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలైతే ఉన్నాయి.

    Also Read: Kalki Movie: కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా..?

    ఇక అదే జరిగితే విష్ణు తనదైన రీతిలో తన సత్తా చాటుకుంటాడు. తను కూడా పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమాలో అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్(Prabhas) లాంటి స్టార్ హీరోలని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మార్కెట్ పరంగా మంచు విష్ణు తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు…ఇక ఇప్పటికే ప్రభాస్ అక్షయ్ కుమార్ షూటింగ్ కూడా ముగిసిందట.

    Also Read: NTR-Prashanth Neel: ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమాలో విలన్ ఎవరో తెలుసా..?

    ఇక ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడని చెప్పడంతోనే బాలీవుడ్ లో ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక విష్ణు స్టార్ హీరో అవ్వడానికి ఈ సినిమా చాలా వరకు హెల్ప్ చేస్తుంది అనేది వాస్తవం.. ఇది కానీ తేడా కొడితే ఇక విష్ణు సినిమా కెరియర్ డైలమాలో పడిపోతుంది. ఇక ఇలాంటి సమయం లో ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…