దేశంలో కల్తీ మద్యం వల్ల ప్రతిరోజూ పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోతున్న సంగతి తెలిసిందే. మద్యపాన నిషేధం అమలవుతున్న రాష్ట్రాలలో చాలామంది కల్తీ మద్యం తాగడం వల్ల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కల్తీ మద్యం తాగి అనారోగ్య సమస్యల బారిన చాలామంది పడుతున్నారని వెలుగులోకి వస్తోంది. తాజాగా బీహార్ రాష్ట్రంలో 41 మంది కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
కొన్ని ప్రాంతాలలో కల్తీ మద్యాన్ని దేశీ మద్యం అని కూడా పిలుస్తారు. మొక్కజొన్న, కుళ్ళిన ద్రాక్ష, బంగాళాదుంపలు, బియ్యం, చెడిపోయిన నారింజ, చెరకు లేదా ఖర్జూరం, చక్కెర, సాల్ట్‌పెట్రే, బార్లీ ఉపయోగించి కల్తీ మద్యంను తయారు చేయడం జరుగుతుంది. ఈస్ట్ ప్రక్రియ ద్వారా పులియబెట్టిన ఈ మద్యానికి బెస్రాంబెల్ ఆకులు, యూరియా, ఆక్సిటాక్సిన్, నౌసాదర్ ను కలపడం జరుగుతుంది.
కల్తీ మద్యం తయారీలో వినియోగించే కెమికల్స్ వల్ల నాడీవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కొంతమంది కల్తీ మద్యం తయారీ కోసం మిథనాల్ ను కూడా కలిపే అవకాశం ఉంటుంది. మద్యం మత్తుగా మార్చడం కోసం మరింత ఎక్కువ మొత్తంలో కెమికల్స్ ను కలుపుతారు. ఇలా కెమికల్స్ ను వినియోగించడం వల్ల విషంగా మారే అవకాశం ఉంటుంది.
యూరియా, ఆక్సిటాక్సిన్, బెస్రాంబెల్ ఆకులను కలపడం వల్ల మిథైల్ ఆల్కహాల్ తయారవుతుంది. శరీరంలో ఆల్కహాల్ ఆల్డిహైడ్ గా మారే అవకాశం ఉంటుంది. ఫార్మాల్డిహైడ్ లేదా ఫార్మిక్ యాసిడ్ మెదడుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కల్తీ మద్యం వల్ల శరీరంలోకి వచ్చే మిథైల్ ఆల్కహాల్ అంతర్గత అవయవాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల అకాల మరణం సంభవించే అవకాశం అయితే ఉంటుంది.