https://oktelugu.com/

trivikram: త్రివిక్రమ్ మొదటి సినిమా పారితోషికం ఎంతో తెలిస్తే షాకవుతారు..

మాటల మాంత్రికుడిగా పేరు పొందిన త్రివిక్రమ్ టాలీవుడ్ డైరెక్టర్లలో ప్రత్యేకత చాటుకున్నాడు. మొదట్లో సినిమాలకు మాటలు రాసిన ఆయన ప్రస్తుతం టాప్ దర్శకుల్లో ఒకరుగా ఉన్నారు. ఆయన తీసిన సినిమాలన్నీ దాదాపు విజయం సాధించినవే. డైలాగ్ లతో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ యంగ్ డైరెక్టర్ అగ్రహీరోలకు మంచి విజయాలను అందించాడు. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ తో ఎక్కువ సినిమాలు చేసిన ఆయన కామెడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన ‘అరవింద […]

Written By:
  • NARESH
  • , Updated On : November 8, 2021 / 09:24 AM IST
    Follow us on

    మాటల మాంత్రికుడిగా పేరు పొందిన త్రివిక్రమ్ టాలీవుడ్ డైరెక్టర్లలో ప్రత్యేకత చాటుకున్నాడు. మొదట్లో సినిమాలకు మాటలు రాసిన ఆయన ప్రస్తుతం టాప్ దర్శకుల్లో ఒకరుగా ఉన్నారు. ఆయన తీసిన సినిమాలన్నీ దాదాపు విజయం సాధించినవే. డైలాగ్ లతో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ యంగ్ డైరెక్టర్ అగ్రహీరోలకు మంచి విజయాలను అందించాడు. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ తో ఎక్కువ సినిమాలు చేసిన ఆయన కామెడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన ‘అరవింద సమేత’ సినిమా సైతం మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా ఇతర ఇండస్ట్రీలో కూడా పేరు తీసుకొచ్చింది. ఇక ఇంత ట్రెండింగ్ సాధించిన త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఆయన మొదటి సినిమాకు ఎంత తీసుకున్నాడు..? ఇప్పుడు ఎంత రేటు పలుకుతున్నాడని కొందరు సినీ ప్రేక్షకులు చర్చలు పెట్టుకుంటున్నారు.

    సినిమాల్లోకి రాకముందు త్రివిక్రమ్ లెక్చరర్ గా పనిచేసేవారు. అప్పట్లోనే ఆయనకు సినిమాలంటే ప్రాణం. ఆ ఆశే అతన్ని సినిమాల వైపు నడిపించింది. సినిమాల్లో అవకాశాల కోసం త్రివిక్రమ్ తెక్చరర్ ఉద్యోగం మానేసి రెండేళ్లు ఖాళీగా ఉన్నాడు. ఆ తరువాత ఆయన కొన్ని సినిమాలకు మాటలు రాశారు. అయితే ‘నువ్వు నాకు వచ్చావ్’, ‘నువ్వే నువ్వే’ సినిమాలకు మాటలు రాయడంతో ఆయన గుర్తింపు పొందాడు. ఈ సినిమాలు కేవలం పంచ్ డైలాగ్ లతోనే విజయం సాధించినట్లు అప్పట్లో చర్చ సాగింది. దీంతో మాటల రచయిత త్రివిక్రమ్ అని తెలియగానే అతనికి మాటల మాంత్రికుడు అని బిరుదు ఇచ్చారు.

    మాటల రచయిత నుంచి డైరెక్టర్ గా ఎదిగారు త్రివిక్రమ్. ఆయన తీసిన మొదటి సినిమా ‘అతడు’ ఈ సినిమా త్రివిక్రమ్ కే కాకుండా అప్పటి వరకు వరుస ప్లాపులతో ఉన్న మహేశ్ బాబుకు సైతం కెరీర్ మలుపు తిప్పింది. దీంతో అక్కడి నుంచి త్రివిక్రమ్ తన విజయ విహారాన్ని కొనసాగించారు. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘ఖలేజా’ తీశారు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా వీక్ గా ఉన్నా డైలాగులు బాగా ఆకట్టుకున్నాయి. ఆ తరువాత పవన్ కల్యాన్ తో త్రివిక్రమ్ తన సక్సెస్ లైఫ్ ను సాగించారు.

    పవన్ -త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా’ అటు పవన్ కల్యాణ్ కు ఇటు త్రివిక్రమ్ కు బ్రేక్ ఇచ్చింది. ఇక ఆ తరువాత పవన్ తో తీసిన ‘అత్తారింటికి దారేది’ సినిమా బంపర్ హిట్టుకొట్టింది. అయితే నితిన్ తో తీసిన ‘అ..ఆ..’ కాస్త నిరాశ పరచడంతో త్రివిక్రమ్ ఈసారి మాస్ సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘అరవింద సమేత..’ సినిమా తీశారు. ఈ సినిమా సైతం త్రివిక్రమ్ సక్సెస్ ఖాతాలో పడింది.

    త్రివిక్రమ్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక్కో సినిమాకు మాటలు రాసినందుకు కేవలం రూ.2 వేలు మాత్రమే తీసుకునేవాడు. ఆ తరువాత డైరెక్టర్ అయిన తరువాత ఇమేజ్ పెరిగింది. ఇప్పుడు ఆయన ఒక్కో సినిమాకు రూ.20 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా తీసేందుకు రెడీగా ఉన్నారు. అయితే పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘బీమ్లా నాయక్’ సినిమాకు స్క్రీన్ ప్లే వహిస్తున్నాడు.