https://oktelugu.com/

Beer: బీరు లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. వేసవిలో దాహం తీరేలా తాగుడే!

బీరులో ఆల్కహాల్‌ ఉంటుంది. ఆల్కహాల్‌ ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్‌ తాగితే లివర్, లంగ్స్‌ దెబ్బతింటాయి. అందుకే వైద్యులు మద్యం తాగొద్దని సూచిస్తున్నారు. అయితే బీరు మితంగా తాగేతే ఆరోగ్యమే అంటున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 14, 2024 / 06:46 PM IST

    Beer

    Follow us on

    Beer: మందు బాబులకు రోజు సుక్క పడనిదే నిద్ర పట్టదు. చలికాలం మద్యం, వేసవిలో బీరు తప్పనిసరి అంటారు. అయితే బీరు బాబుల కోసం వైద్యులు ఓ శుభవార్త చెప్పారు. లిమిటెడ్‌గా బీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు. అతిగా సేవిస్తే మాత్రం ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. వైద్యులు బీరు ఎందుకు మంచిది అంటున్నారు. ఎలా మంచి చేస్తుంది అనే వివరాలు తెలుసుకుందాం.

    అతిగా తాగితే అంతే..
    బీరులో ఆల్కహాల్‌ ఉంటుంది. ఆల్కహాల్‌ ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్‌ తాగితే లివర్, లంగ్స్‌ దెబ్బతింటాయి. అందుకే వైద్యులు మద్యం తాగొద్దని సూచిస్తున్నారు. అయితే బీరు మితంగా తాగేతే ఆరోగ్యమే అంటున్నారు. బీరులో శరీరానికి మేలు చేసే కాల్షియం, పాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. బీరు తాగడం వలన ఇవి శరీరానికి అందుతాయి. ఈ పోషకాలు అందితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హృదయ సంబంధ వ్యాధులు తగ్గుతాయి. కిడ్నీ సంబంధ వ్యాధులు కూడా దూరమవుతాయి. కిడ్నీల్లో రాళ్లన కరిగించడంలో బీరు సహకరిస్తుంది. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ను కూడా బీరు కంట్రోల్‌ చేస్తుంది. ఆయుష్షును బీరు పెంచుతుంది. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌ చేయడంతోపాటు చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించి మంచి కొవ్వును పెంచేందుకు సాయం చేస్తుంది. అందుకే ఇన్ని గుణాలు ఉన్న బీరును రోజుకు ఒక గ్లాస్‌ తాగడం మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు.

    పోర్చుగీసు యూనివర్సిటీ అధ్యయనంలో..
    బీరు ప్రతీరోజు తాగడం ఆరోగ్యానికి మంచిదే అని పోర్చుగీసుకు చెందిన ఓ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలోనూ వెల్లడైంది. పోర్చుగల్‌లోని నోవా యూనివర్సిటీ లిస్బన్‌కు చెందిన శాస్త్రవేత్తలు బీరుతో లాభ నష్టాలపై పరిశోధన చేశారు. రోజు రాత్రి భోజనంతోపాటు బీరు తాగడం వలన పురుషుల పొట్టలో మంచి బ్యాక్టిరియా పెరుగుతుందని గుర్తించారు. ఈ ప్రయోజనం ఆల్కహాలిక్‌, నాన్‌ ఆల్కహాలిక్‌ బీర్‌ రెండింటికి వర్తిస్తుందని పేర్కొన్నారు.

    19 మంది.. 4 వారాలపాటు పరిశోధన..
    యూనివర్సిటీకి చెందిన 35 మంది శాస్త్రవేత్తలు 35 సంవత్సరాల పురుషులపై ఈ పరిశోధన సాగించారు. నాలుగు రవారాలపాటు ప్రతీరోజు రాత్రి భోజనంతోపాటు 325 మిల్లీ లీటర్ల బీర్‌ తాగాలని కోరారు. పరిశోధనలో పాల్గొన్న వారిలో కొందరికి ఆల్కహాలిక్‌ బీరు, మరికొందరికి నాన్‌ ఆల్కహాలిక్‌ బీరు తాగించారు. 4 వారాల అధ్యయనం తర్వాత పురుషుల మలం, రక్త నమూనాలు తీసుకున్నారు. ఈ నమూనాల ఆధారంగా బీరు తాగడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టిరియా పెరిగినట్లు గుర్తించారు. జీర్ణవ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వెల్లడించారు. అధ్యయనం ఫలితాలను జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో శాస్త్రవేత్తలు ప్రచురించారు.

    డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెప్పారని ఎంత పడితే అంత బీర్‌ తాగితే కచ్చితంగా అనారోగ్యంపాలవుతారు. లిమిట్‌గా, మోతాదు మించకుండా ఒక టానిక్‌లాగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఇష్టారాజ్యంగా తాగితే మాత్రం ప్రమాదకరమే. మందుబాబులు తస్మాత్ జాగ్రత్త!!