Baking soda be mixed with water: చాలా మంది ఇంటిలో బేకింగ్ సోడాను వాడుతుంటారు. ఏవైనా వంటలు చేసేటప్పుడు లేదా ఇంటిని క్లీన్ చేయడానికి వంటి సందర్భాల్లో ఎక్కువగా వాడుతుంటారు. బేకింగ్ సోడా వంటల్లో కలపడం వల్ల రుచిగా ఉంటాయని చాలా మంది కలుపుతారు. సోడియం బైకార్బోనేట్‌ను బేకింగ్ సోడా అని అంటారు. అయితే వంటల్లో విరివిగా వాడే ఈ బేకింగ్ సోడా వల్ల ఎన్న ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బేకింగ్ సోడాతో దంతాల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు కీడ్నీల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. బేకింగ్ సోడా వల్ల నల్లగా ఉన్న దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. అలాగే జీర్ణ సమస్యలను కూడా నయం చేయడంలో బేకింగ్ సోడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే బేకింగ్ సోడాను వంటల్లో వాడటం సాధారణమే. కానీ కొందరు దీనిని నీటిలో కలిపి తాగుతుంటారు. ఇలా అసలు తాగవచ్చా? తాగితే ఏదైనా ప్రమాదమా? తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయా? లేదా? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎవరికైనా కడుపు నొప్పి, వాంతులు, అజీర్ణంగా ఉంటే నీటిలో బేకింగ్ సోడా కలిపి తాగమని సలహా ఇస్తుంటారు. అలా ఇలా తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? కాదా? అని చాలా మంది సందేహ పడుతుంటారు. అయితే గ్లాసు నీటిలో బేకింగ్ సోడా కలిపి తాగడం ఆరోగ్యానికి మంచిదే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్లాసు నీటిలో చిన్న టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కలిపి తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే బేకింగ్ సోడాను మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. తక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. బేకింగ్ సోడా శరీరంలోని pH స్థాయిలను కూడా మెరుగుపరుస్తుంది. ఇందులోని ఖనిజాలు శరీరంలోని ద్రవ సమతుల్యతను కాపాడుతుంది.
కొందరు ఎక్కువగా వ్యాయామం చేస్తుంటారు. అలాంటివారు బేకింగ్ సోడాను నీటిలో కలిపి తాగడం వల్ల కండరాలు బలంగా తయారు అవుతాయట. ఇలా బేకింగ్ సోడా తాగడం వల్ల ఎక్కువ సమయం వ్యాయామం చేయగలరు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపును కూడా తగ్గిస్తాయి. అలాగే కీళ్ల నొప్పులు వంటి సమస్యలను కూడా బేకింగ్ సోడా తగ్గిస్తుంది. ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా బేకింగ్ సోడా తీసుకుంటే అధిక రక్తపోటు సమస్య వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా డాక్టర్ పర్మిషన్ లేకుండా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే తీవ్ర సమస్యలు ఎదుర్కొవలసి వస్తుంది. కాబట్టి ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా బేకింగ్ సోడా తీసుకుంటే ప్రమాదంలో పడతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.