Mobile : వేసవిలో మొబైల్ ఫోన్ హీటెక్కుతోందా? డేంజర్ మరీ.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Mobile : ప్రస్తుత రోజుల్లో ఫోన్ వాడకం పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ఫోన్ లేనిదే బయటకు కూడా వెళ్లడం లేదు. దీంతో మొబైల్ వినియోగం అధికమైపోయింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొబైల్ వాడకుండా ఉండటం లేదు. ఫలితంగా దాని వల్ల వచ్చే నష్టాలకు బాధ్యులవుతున్నారు. ఎండాకాలంలో ఫోన్ ఊరికే వేడవుతుంది. దీంతో ఏర్పడే అనర్థాలకు కారకులవుతున్నారు. బజారులో నడుస్తున్నా, బస్ లో వెళ్లినా చేతిలో ఫోన ఉండాల్సిందే. లేకపోతే ఏమీ తోచదు. ఏ పని కాదు. కరెంటు […]

Written By: NARESH, Updated On : May 8, 2023 11:52 am
Follow us on

Mobile : ప్రస్తుత రోజుల్లో ఫోన్ వాడకం పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ఫోన్ లేనిదే బయటకు కూడా వెళ్లడం లేదు. దీంతో మొబైల్ వినియోగం అధికమైపోయింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొబైల్ వాడకుండా ఉండటం లేదు. ఫలితంగా దాని వల్ల వచ్చే నష్టాలకు బాధ్యులవుతున్నారు. ఎండాకాలంలో ఫోన్ ఊరికే వేడవుతుంది. దీంతో ఏర్పడే అనర్థాలకు కారకులవుతున్నారు. బజారులో నడుస్తున్నా, బస్ లో వెళ్లినా చేతిలో ఫోన ఉండాల్సిందే. లేకపోతే ఏమీ తోచదు. ఏ పని కాదు.

కరెంటు బిల్లు, పాల బిల్లు, డిష్ బిల్లు, కిరాణా బిల్లు ఒకటేమిటి ప్రతీది నెట్లోనే కడుతున్నారు. చేతిలో డబ్బు ఉన్నా లేకపోయినా ఫర్వాలేదు కానీ ఫోన్ లేకపోతే పనులు జరగవు. అంతలా మొబైల్ మన జీవితంలో పెనవేసుకుపోయింది. దీంతో మన పనులు కూడా ఫోన్ తోనే జరుగుతున్నాయి. అందుకే అందరు మొబైల్ లేనిదే బయట కాలు పెట్టడం లేదంటే అతిశయోక్తి కాదు.

ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి. పది అయ్యిందంటే చాలు కాలు బయట పెట్టేందుకు వణుకుతున్నారు. అంతలా ఎండలు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ వాడకం ఓ సవాలుగా మారింది. ఎండకు ఫోన్ వేడెక్కుతుంది. అది అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేదు. వేడికి చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఎండలో ఫోన్ వాడకం తగ్గిస్తేనే మంచిది.

ఎండ నుంచి వచ్చే సూర్యకిరణాలు నేరుగా ఫోన్ పై పడతాయి. మనం ఫోన్ ను డైరెక్టుగా చూడటం వల్ల ఆ అతినీల లోహిత కిరణాల వల్ల మన కంటిచూపుపై ప్రభావం పడుతుంది. అందుకే ఎండాకాలంలో ఫోన్లు జాగ్రత్తగా వాడుకోవాలి. మొబైల్ వేడిగా ఉన్నప్పుడు వాడటం సరికాదు. అది చల్లగా అయిన తరువాతే వాడాలి. లేకపోతే వేడికి పేలిపోయే ప్రమాదం ఉంటుంది.

ఇలా ఫోన్ వాడకంలో ఉన్న ఇబ్బందులను గుర్తుంచుకుని మొబైల్ వాడకంలో టిప్స్ పాటించడం ఉత్తమం. లేదంటే మన ఆరోగ్యంపై పెను ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఫోన్ వాడకం వల్ల కలిగే దుష్ర్పభావాలను దూరం చేసుకుని మంచి ఆరోగ్యవంతమైన ఫలితాలు అందుకునేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags