Bank Loan: 2025 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు వినియోగదారులకు పదేపదే గుడ్ న్యూస్ చెబుతోంది. ఎందుకంటే ఇప్పటివరకు మూడు సార్లు రెపో రేట్లు తగ్గించింది. దీంతో గృహ, వెహికల్ లోన్ తీసుకున్న వారికి వడ్డీ రేటు తగ్గడంతో పాటు ఈఎంఐ కూడా చాలా వరకు తగ్గింది. అయితే తాజాగా మరోసారి రెపో రేట్ తగ్గించడంతో రుణభారం మరింత తగ్గే అవకాశం ఉంది. ఇటీవల ఆర్బిఐ రిపోర్టును 0.25% తగ్గించింది. ఈ క్రమంలో బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. అయితే రేపో రేటుకు అనుగుణంగా ఏ బ్యాంకు ఎంతవరకు వడ్డీ తగ్గించిందో ఇప్పుడు చూద్దాం..
బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వారికి తాజాగా బ్యాంకులు శుభవార్తలు తెలిపాయి. ఇప్పటివరకు ఇల్లు కోసం, వాహనం కొనుగోలు కోసం రుణం తీసుకున్న వారికి వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. డిసెంబర్ 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఒకవైపు రూపాయి పతనం కొనసాగుతున్నా… వడ్డీ రేట్లపై తగ్గించడంతో హర్షం వ్యక్తం అవుతుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో చాలా బ్యాంకులు స్పందించాయి. రెపో రేట్ కు అనుగుణంగా కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు సవరించాయి. వీటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పటివరకు వడ్డీ రేటు 8.35 విధించేది. తాజాగా 8.10 కు సవరించింది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా 8.15 నుంచి 7.90 శాతానికి.. బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.35 నుంచి 8.10 వరకు తగ్గింపు చేసినట్లు ప్రకటించింది. ఈ వడ్డీ రేటు తగ్గించడంతో ఈ బ్యాంకుల్లో గృహ రుణం తీసుకున్న వారికి 7.10 వడ్డీ శాతం ఉండనుంది. అలాగే కారు లోన్ తీసుకున్న వారికి 7.45 వడ్డీ రేటు ఉంటుందని తెలిపాయి. కొత్తగా రుణం తీసుకునే వారికి సైతం ఇదే వడ్డీ ఉంటుందని పేర్కొంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాదిలో మొత్తం నాలుగు సార్లు బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు, ఏప్రిల్ లో 25, జూన్ నెలలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. డిసెంబర్ 5న మరో 25 బేసిస్ పాయింట్ తగ్గించడంతో మొత్తం ఏడాదిలో 125 బేసిస్ పాయింట్ తగ్గించినట్లు అయింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో కొనుగోళ్లు పెరిగాయి. కానీ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. దీంతో అంచనాలను 2.6 నుంచి రెండు శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. అయితే భవిష్యత్తులో ఈ వడ్డీ రేట్లు తగ్గుతాయా? లేదా పెరుగుతాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వడ్డీరేట్లు తగ్గడంతో చాలామంది లోన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.