https://oktelugu.com/

Relationships : శృంగార కోరికలు ఎందుకు తగ్గుతాయో తెలుసా?

ఆమెలో శృంగార కోరికలు పెరిగేందుకు కావాల్సిన పరిస్థితులు కల్పించుకోవాలి. అప్పుడే వారి మధ్య లైంగిక వాంఛలు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 3, 2023 / 11:41 AM IST
    Follow us on

    Relationships : ఇటీవల కాలంలో శృంగారం మీద ఆసక్తి తగ్గుతోంది. అది ఆలుమగల మధ్య అనుబంధానికి కత్తెర వేస్తోంది. విశ్రాంతి లేకుండా కష్టపడటం వల్ల కామోద్దీపన వాంఛలు పెరగడం లేదు. దీని వల్ల భార్యాభర్తలకు నిరాశ కలుగుతోంది. దీనికి తోడు మనం తీసుకునే ఆహారాలు కూడా ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో శృంగారం మీద నిజంగానే ఆసక్తి లేకుండా పోతోంది.

    ముసలితనం, హార్మోన్ల ప్రభావం కూడా ఒక కారణంగా నిలుస్తోంది. మన శరీరంలో వచ్చే మార్పులు కూడా మనకు సహకరించడం లేదు. ఈ క్రమంలో మనలో లైంగిక ఆసక్తి కలగడానికి గల మార్గాలు చూసుకోవడం మంచిది. లేకపోతే సంసారంలో గొడవలు రావడం సహజం. భర్త సహజంగా ఆడవారిని ప్రేరేపించాలి. కానీ కోరికల ప్రభావం సన్నగిల్లడంతో ఏం చేయలేని పరిస్థితి.

    భాగస్వామికి లైంగిక వాంఛలు రగిలించేందుకు ప్రోత్సహించాలి. భార్యను అప్పుడప్పుడు తాకుతూ ఆమెలో కోరికలు రగిలించాలి. ఆమెలో శృంగార కోరికలు పెరిగేందుకు కావాల్సిన పరిస్థితులు కల్పించుకోవాలి. అప్పుడే వారి మధ్య లైంగిక వాంఛలు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో దంపతుల మధ్య ఆ కోరికలు పెరిగేందుకు పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

    మెనోపాజ్ దశలో మహిళల యోని పొడిబారిపోతుంది. దీని వల్ల శృంగారం ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఆడవారు లూబ్రికెంట్ వాడాలి. దీని వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. ఒకవేళ డయాబెటిస్ ఉంటే షుగర్ లేని లూబ్రికెంట్ తీసుకోవడం ఉత్తమం. ఇలా శృంగారానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుని భావప్రాప్తి పొందేందుకు అవకాశాలను కల్పించుకోవడం ఉత్తమం.