Homeహెల్త్‌drink alcohol : మొట్టమొదట మద్యం తాగింది ఎవరో తెలుసా? ఆ ఆసక్తికర విషయాలివీ

drink alcohol : మొట్టమొదట మద్యం తాగింది ఎవరో తెలుసా? ఆ ఆసక్తికర విషయాలివీ

drink alcohol : ప్రపంచంలో మొట్టమొదట మద్యం తాగిన వ్యక్తి ఎవరు అని ఎప్పుడైనా థింక్ చేశారా? . అయితే చైనీయులే మొదట సారా తాగారు అని సమాచారం. చైనాలో 7,000 BC నాటికి బజ్రాతో తయారు చేసిన మద్యం ఆనవాళ్లు కనిపించాయట. జియాహు పట్టణంలో మట్టి కుండల్లో మద్యం అవశేషాలు కనుగొన్నారు నిపుణులు. అంతేకాదు జార్జియాలో కూడా మద్యం ఆనవాళ్లు ఉన్నాయట.  యూరప్‌లోని పురాతన మద్యం జార్జియాలో కనుగొన్నారట. 6,000 BC నాటి ద్రాక్ష కిణ్వ ప్రక్రియ ద్వారా దీన్ని తయారు చేశారని సమాచారం.

ఇరాన్‌లో 5,400 BC నాడే మద్యం ఉండేదని టాక్. అయితే ఇక్కడ  జాగ్రోస్ కొండల్లో 5,400 BC నాటి మద్యం ఆనవాళ్లు కనిపించాయి అని అధ్యయనంలో తేలింది. ఇక్కడ మట్టి కుండల్లో ద్రాక్ష కిణ్వ ప్రక్రియ అవశేషాలను కనుగొన్నారట.
పురాతన ఈజిప్టులో కూడా మద్యం ఆనవాళ్లు ఉన్నాయి. ఇక్కడ ద్రాక్ష, బార్లీ తో మద్యం తయారు అవుతుంది. ఈజిప్టు శాసనాలలో మందు తయారీ ప్రక్రియకు సంబంధించి ఆధారాలు కనుగొన్నారు.

పురాతన మెసొపొటేమియా (ఆధునిక ఇరాక్)లో బీర్, మద్యం ఆనవాళ్లు ఉన్నాయట. ఇక్కడ బార్లీ నుంచి బీర్ తయారు చేశారట. అంతేకాదు దీన్ని మతపరమైన కార్యక్రమాల్లో వినియోగించారు కూడా. ఇక భారతదేశం విషయానికి వస్తే వేదకాలం నుంచి సోమరసం, సురాపానం వాడారట. మతపరమైన, సామాజిక కార్యక్రమాల్లో ఉపయోగించారు. పురాతన గ్రీస్, రోమ్‌లలో మద్యం ఉనికి గుర్తించారు. ఇక్కడ మద్యంతో దేవుడు డయోనిసస్‌ను పూజించేవారు అని సమాచారం. రోమ్‌లో కూడా మతపరమైన, సామాజిక కార్యక్రమాల్లో మద్యం మస్ట్ గా ఉండేదట.

అర్మేనియాలో 4,100 BC నాటి మద్యం పురాతన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు శాస్త్రవేత్తలు. జర్మనీలోని రైన్‌ల్యాండ్ ప్రాంతంలో 1867లో తవ్వకాల సమయంలో శతాబ్దాల నాటి (పదిహేడు శతాబ్దాలు) మద్యం సీసా దొరికిందట. అంటే ఈ మద్యం ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పటి నుంచో రాజ్యాలను ఏలుతుందన్నమాట. మరి ఇకనైనా కాస్త మీరు కంట్రోల్ చేసుకోవచ్చు కదా. దీని వల్ల వచ్చే చాలా సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version