Worship Trees : మన సనాతన ధర్మంలో మనం మొక్కలు, చెట్లు, విగ్రహాలను పూజిస్తుంటాం. వాటిలో కూడా దేవుడు ఉంటాడని భావిస్తాం. వాటిని కూడా ఎంతో నియమ నిష్టలతో పూజలు చేస్తుంటాం. ఇందులో భాగంగా కొన్ని రకాల చెట్టను ఆరాధిస్తుంటాం. మన పూర్వ కాలం నుంచే ఈ ఆచారం ఉంది. దీంతో వాటిలో కూడా మనం దేవతలు కొలువుంటారని మన విశ్వాసం.
ఉసిరి, తులసి, అరటి
ఉసిరి, తులసి, అరటి చెట్లు విష్ణువు, లక్ష్మీదేవికి ప్రతిరూపాలుగా కొలుస్తారు. తులసి చెట్టుకు దీపం వెలిగిస్తారు. ఏకాదశి, ఆదివారం రోజుల్లో ముట్టుకోరు. అత్యంత పవిత్రంగా చూస్తారు. ఉసిరిని కూడా విష్ణువు ప్రతిరూపంగా చూస్తారు. దీనికి కార్తీక పౌర్ణమికి ప్రత్యేక పూజలు చేస్తారు. అరటి చెట్టును పూజిస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అరటిచెట్టుపై పసుపు కలిపిన నీటిని చల్లి పూజిస్తారు.
మారేడు, మర్రి
శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది మారేడు. దీన్నే బిల్వ వృక్షం అంటారు. శివరాత్రి రోజు వీటి ఆకులతో పూజ చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మన కోరికలు నెరవేరుతాయని చెబుతారు. ప్రతి త్రయోదశి రోజు మర్రి చెట్టును పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. మర్రి కూడా దేవతల వృక్షమే. మర్రితో కూడా మనకు అనేక లాభాలున్నాయి.
జమ్మిచెట్టు
ప్రతి శనివారం జమ్మిచెట్టుకు ఆవనూనెతో దీపాన్ని వెలిగిస్తే శుభం కలుగుతుంది. ఇంట్లో అన్ని రకాల ఇబ్బందులు తొలగుతాయి. దుష్టశక్తులు దూరంగా వెళతాయి. ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. జమ్మి ఆకులు శివుడికి సమర్పిస్తే సంతోషిస్తాడు. ఇలా చెట్ల వల్ల కూడా మనం దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చని మన పురాణాలు ఘోషిస్తున్నాయి.
కదంబ వృక్షం
శ్రీ మహాలక్ష్మి కదంబ వృక్షంపై నివసిస్తుందని నమ్ముతుంటారు. అందుకే దీన్ని పూజిస్తుంటాం. కదంబ చెట్టు కింద కూర్చుని యజ్ణం చేస్తే మంచి లాభాలుంటాయి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ చెట్టు ఎంతో ఉపయోగపడుతుంది. ఆమె కృప మనపై ఉండాలంటే ఈ చెట్టుకు పూజలుచేయడం మంచిది. ఇలా మన ధర్మంలో చెట్లకు కూడా మంచి ప్రాధాన్యం ఇచ్చి పూజలుచేయడం ఆనవాయితీగా వస్తోంది.