Vitamin D: ఇటీవల కాలంలో విటమిన్ల లోపం బాధిస్తోంది. దీని వల్ల రోగాల బారిన పడుతున్నాం. అయినా మనలో మార్పు కనిపించడం లేదు. ఫలితంగా ఎన్నో జబ్బులకు దగ్గరవుతున్నాం. కానీ మనలో నిర్లక్ష్యమే కనిపిస్తోంది. దీని వల్ల మన ఆహార అలవాట్లు మార్చుకోవడానికి ఎవరు ఇష్టపడటం లేదు. విటమిన్ డి లోపం వల్ల తలెత్తే సమస్యలు ఎన్నో ఉన్నాయి. విటమిన్ డి మనకు అందేలా సాయపడే ఆహారాలు ఉన్నాయి. వాటిని తీసుకోవడం ఎంతో ముఖ్యం.
ఆవు పాలలో..
విటమిన్ డి లోపం ఉన్నప్పుడు ఆవుపాలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి. పచ్చిపాలు తాగడం ఇంకా మంచిది. ఒకవేళ పచ్చిపాలు తాగడం ఇష్టం లేకపోతే స్మూతీగా మార్చుకుంటే మంచిది. తాగే సమయంలో చాక్లెట్ సిరప్ కలుపుకుంటే మంచి లాభాలు కలుగుతాయి. ఆవుపాలలో పోషకాలు ఎన్నో ఉంటాయి.
కమలా పండ్లు
సిట్రస్ పండ్లలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ డి అధికంగా ఉంటుంది. చర్మ సంరక్షణలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ప్రతి రోజు విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది. కమలా పండ్ల జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యం బాగు పడుతుంది.
సోయా
విటమిన్ లోపం తలెత్తితే సోయా పాలు తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. సోయా పాలతో చేసిన పదార్థాలతో విటమిన్ డి లోపం పోతుంది. సోయా పాలు తాగడం వల్ల ఇందులో ఉన్న ఔషధ గుణాల వల్ల మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇందులో ఇనుము, పాస్పరస్, నియాసిన్, విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల లాభం జరుగుతుంది. రక్తప్రసరణ బాగుంటుంది. కొవ్వు కరిగిస్తుంది.
మజ్జిగ
పెరుగు, మజ్జిగలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. శరీరంలో విటమిన్ డి లోపం వల్ల దాని స్థానం భర్తీ చేసేందుకు ఇది సాయపడుతుంది. వేడి వాతావరణంలో పెరుగు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. క్యారెట్ జ్యూస్ శరీరానికి జీవశక్తి కలిగిస్తుంది. విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల కంటి చూపును ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ డి లోపం లేకుండా చూస్తుంది.